Telugu News » Blog » సౌందర్య చనిపోయిన తరవాత అంత జరిగిందా…? ఆమె ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు అలా చేశారా…!

సౌందర్య చనిపోయిన తరవాత అంత జరిగిందా…? ఆమె ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు అలా చేశారా…!

by AJAY
Ads

టాలీవుడ్ అందాలతార సౌందర్య 2004 లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సౌందర్య మరణం టాలీవుడ్ ను విషాదం లోకి నెట్టివేసింది.

Advertisement

soundarya

soundarya

ఇప్పటికీ ఆమె అభిమానులు సౌందర్య ను గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. సౌందర్య బతికి ఉంటే ఇంకా ఎన్నో మంచి పాత్రలు చేసి ఉండేదని ఆమె అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. సినిమాల్లో సక్సెస్ అయిన సౌందర్య బీజీపిలో చేరారు.

అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్ లో బయలుదేరగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో సౌందర్య సోదరుడు అమర్ నాథ్ కూడా కన్నుమూశారు. కాగా సౌందర్య మరణం తరవాత అభిమానులు అంతా ఆమెను తలుచుకుని బాధలో ఉంటే బంధువులు మాత్రం ఆమె ఆస్తుల కోసం పోటీ పడ్డారు.

Advertisement

సౌందర్య తల్లి మంజుల సౌందర్య భర్త రఘు ఒకవైపు ఉంటే మరో వైపు సౌందర్య మరదలు అమర్ నాథ్ భార్య నిర్మల ఆస్తుల కోసం కోర్టు మెట్లు ఎక్కినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. సౌందర్య ఆరు కాస్లీ ప్రాపర్టీస్ కొనడం తో పాటు భారీగా నగలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వారి కుటుంబానికి రెండు ఇల్లు ఉండగా అందులో ఒకటి అమర్ నాథ్ కుమారుడు సాత్విక్ పేరు పై ఉండగా మరో ఇల్లు సౌందర్య మరియు ఆమె సోదరుడి పేరు పై ఉండేది.

Also Read: థాంక్యూ ట్రైల‌ర్ లో ఆ డైలాగ్ ను గ‌మ‌నించారా..? స‌మంతను ఉద్దేశించే చైతూ అంత మాట అన్నాడా..?

హైదరాబాద్ లో సౌందర్య కొనుగోలు ప్రాపర్టీ నుండి వచ్చే డబ్బులు ఆమె తల్లి, సోదరుడి కుటుంబానికి మరియు సౌందర్య భర్త పిల్లలకి అందేవి. మొదటగా సౌందర్య మేనల్లుడు సాత్విక్ ఆస్తుల విషయమై కోర్టును ఆశ్రయించారు. తన నానమ్మ ప్రాపర్టీ తన పేరున చేయాలని కేసు వేశారు. ఈ కేసులో చివరికి సాత్విక్ కు న్యాయం జరిగినట్లు తెలుస్తోంది. కోర్టు సౌందర్య తల్లి మంజుల, సౌందర్య భర్త రఘు లకు వేసిన ప్రశ్నల కు వాళ్ళు సరైన సమాధానం ఇవ్వకపోవడం తో సాత్విక్ చేతికి ఆస్తులు వెళ్లినట్టు తెలుస్తోంది.

Advertisement

Also read : థాంక్యూ ట్రైల‌ర్ లో ఆ డైలాగ్ ను గ‌మ‌నించారా..? స‌మంతను ఉద్దేశించే చైతూ అంత మాట అన్నాడా..?

You may also like