Home » Raghuvaran: రఘువరన్” చనిపోయే రోజుల్లో ఎంతటి నరకాన్ని అనుభవించారంటే ?

Raghuvaran: రఘువరన్” చనిపోయే రోజుల్లో ఎంతటి నరకాన్ని అనుభవించారంటే ?

by AJAY
Published: Last Updated on
Ad

సినిమాల్లో హీరో పాత్ర పవర్ ఫుల్ గా కనిపించాలంటే హీరోను ఢీకొట్టే విలన్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే హీరో విలన్ లా మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇక టాలీవుడ్ లో అలా మెప్పించిన విలన్లలో రఘువరన్ కూడా ఒకరు. రఘువరన్ తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో విలన్ గా ఎంతో గుర్తింపు సాధించారు.

Also Read:  నరేష్ నిద్ర లేచిదంటే చాలు అదే పని.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రమ్య రఘుపతి..!

Advertisement

ముఖ్యంగా తన భీకరమైన గొంతుతో రఘువరన్ ప్రేక్షకులను భయపెట్టేవారు. ఆయన గొంతుకే చాలామంది అభిమానులు కూడా ఉండేవారు. ఇక రఘువరన్ విలన్ గా నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఆయన బిజీ నటుడిగా ఉండేవారు. కేవలం విలన్ గానే కాకుండా రఘువరన్ సినిమాల్లో తండ్రి పాత్రలు మరియు ఇతర పాత్రలు సైతం చేశారు.

Also Read:  మోక్షాజ్ఞ లో ఈ మార్పు రావడానికి కారణం అదేనా…?

Advertisement

అయితే విలన్ గా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతో సక్సెస్ చూసిన రఘువరన్ నిజజీవితంలో మాత్రం కష్టాలను ఎదుర్కొన్నారు. సినిమాల్లో బిజీ నటుడిగా ఉన్న సమయంలోనే రఘువరన్ నటి రోహిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. అయితే కొన్నేళ్ళ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో సరిగ్గా ఏడేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రఘువరన్ జీవితంలో చీకటి రోజులు మొదలయ్యాయి.

Also Read:  Telugu TV Anchors: తెలుగు యాంక‌ర్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..అందరికంటే ఎక్క‌వ ఎవ‌రికంటే..?

రఘువరన్ మద్యానికి బానిస అయ్యాడు. అక్కడితో ఆగకుండా మాదకద్రవ్యాలకు సైతం రఘువరన్ బానిస అయ్యాడు. అలా చెడు అలవాట్లకు దగ్గర అవడంతో 59ఏళ్ళ వయసులోనే నిద్రలో గుండె పోటుతో మరణించాడు. అయితే రఘువరన్ చనిపోయే ముందు రోజే ఓ సినిమా షూటింగ్ కోసం చనిపోయే సీన్ లో నటించాడు. మరుసటిరోజే ఆయన కన్ను మూశారు. ఈ విషయం చాలామందికి తెలియదు.

Visitors Are Also Reading