టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలోనే మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో అక్టోబర్ 4న ఓటుకు నోటు కేసు లిస్ట్ అయింది. ఈ కేసుకు సంబంధించి 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాటి ఏపీ సీఎం చంద్రబాబుని ముద్దాయిగా చేర్చాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం. తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ కూడా మరో పిటిషన్ వేశారు.
Advertisement
అయితే 2015లో జరిగిన ఈ కేసు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడానికి నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కి రేవంత్ రెడ్డి డబ్బులిస్తుండగా.. పట్టుకున్నామంటూ తెలంగాణ ఏసీబీ అప్పట్లో ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ వీడియోలో నోట్ల కట్టలతో స్పష్టంగా కనిపించారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఓ ఆడియో కూడా బయటికి వచ్చింది. దీంతో ఆ డబ్బులను చంద్రబాబు పంపించారని వైసీపీ నేతలు ఆరోపించారు. అదేవిధంగా టీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేశారు. ఇన్ని రోజుల వరకు ఈ కేసు చాలా సెలెంట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు కి సంబంధించి స్కిల్ డెవలప్ మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులు కోర్టులో బిజీగా ఉన్న సమయంలోనే తాజాగా ఓటుకు నోటు కేసు కూడా తెరపైకి వచ్చింది.
Advertisement
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై దాదాపు 23 రోజుల నుంచి రాజమండ్రి జైలులోనే ఉన్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ జరుగుతోంది. అక్టోబర్ 03న విచారణ చేపట్టనున్నారు. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుతో పాటు రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పై బయటికి వచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న సమయంలో ఈ కేసు మళ్లీ బయటికీ రావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఓటుకు నోటు కేసు పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. టీడీపీ వర్గాల్లో మాత్రం చాలా ఉత్కంఠగానే ఉందని చెప్పాలి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
నాగిని ఫేమ్ మౌని రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!