తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఓటమిని ఎరుగని డైరెక్టర్ గా తెలుగు రంగ పరిశ్రమలో నిలిచినా దర్శక ధీర రాజమౌళి కి కూడా కెరీర్ పరంగా ఒడిదుడుకులు తప్పలేదు. ఒక మూమెంట్ లో ఆయన చాలా డిప్రెస్ అయిపోయిన సందర్భం కూడా వచ్చింది. ఆ సందర్భం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఏప్రిల్ 17 2015 న రాజమౌళి చాలా డిప్రెషన్ కు గురి అయ్యారట. ఆ రోజు ప్రత్యేకత ఏమిటో గుర్తుందా? అది బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యిన రోజు. బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వడానికి, రాజమౌళి డిప్రెషన్ ఫీల్ అవ్వడానికి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యిన రోజు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇంత మంది కష్టపడి పని చేసి, తన మీద నమ్మకంతో కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇలా అయ్యింది ఏంటి అని రాజమౌళి చాలా బాధపడ్డారట.
Advertisement
కానీ, ఒక్క రోజులోనే పాజిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దానితో రాజమౌళి తిరిగి ఊపిరి పీల్చుకున్నారట. బాహుబలి పార్ట్ వన్ అలాగే ఆ తరువాత వచ్చిన పార్ట్ 2 ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళికి కూడా టెన్షన్ తప్పలేదు.
మరిన్ని ముఖ్య వార్తలు:
Lavanya Tripati : కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా ?
Adhipurush : హనుమంతుడి సీటు పక్కన ఉన్న సీటు ధర ఎంతో తెలుసా?
50 ఏళ్ల వయసులో మరో బిడ్డకు తండ్రయిన ప్రభుదేవా