Home » 50 ఏళ్ల వయసులో మరో బిడ్డకు తండ్రయిన ప్రభుదేవా 

50 ఏళ్ల వయసులో మరో బిడ్డకు తండ్రయిన ప్రభుదేవా 

by Bunty
Ad

 

చిత్ర పరిశ్రమలో చాలామంది డాన్స్ మాస్టర్ లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమందికి మాత్రమే మంచి పేరు వచ్చింది. కొంతమంది మాత్రమే ఇప్పటికీ తమ పర్ఫామెన్స్ తో టాప్ ప్లేస్ లో ఉన్నారు. అలా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నది కొరియోగ్రాఫర్, డాన్సర్ ప్రభుదేవా మాత్రమే. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా అలాగే కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

కర్ణాటక వాస్తవులు అయిన ప్రభుదేవా… తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో కొరియోగ్రాఫర్ గా బాగా ఫేమస్ అయ్యారు. దాదాపు 36 సంవత్సరాల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు ప్రభుదేవా. పలు సినిమాలలో హీరోగా కూడా నటించారు ప్రభుదేవా. ప్రస్తుతం ప్రభుదేవా వయసు 50 ఏళ్లు. అయితే ఈ సమయంలో ప్రభుదేవా మరోసారి తండ్రయ్యాడు. తన రెండో భార్య హిమనీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement

ఈ వార్తపై హీరో ప్రభుదేవా స్పందిస్తూ… నేను 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యాను అని పేర్కొన్నారు. ఈ తరుణంలో తనకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు ప్రభుదేవా. ఇకపై పని భారం తగ్గించుకొని… కుటుంబంతో ఎంజాయ్ చేస్తానని ప్రకటించారు ప్రభుదేవా. కాగా ప్రభుదేవా మొదట రామలతను పెళ్లి చేసుకోగా ఆమెకు ముగ్గురు మగ పిల్లలు పుట్టారు. అందులో ఒకరు దురదృష్టవశాత్తు మరణించారు. కాగా తాజాగా 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యాడు హీరో ప్రభుదేవా.

Visitors Are Also Reading