Home » ఇండియా ఫైనల్ వెళ్లడం పక్క.. ఎలా అంటే..?

ఇండియా ఫైనల్ వెళ్లడం పక్క.. ఎలా అంటే..?

by Azhar
Ad

భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ సెమీస్ కి చేరింది. ఇక్కడ ఇండియా జట్టు ఇంగ్లాండ్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తుంది అని.. తప్పకుండ ఫైనల్స్ కు వెళ్తుంది అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే వారి నమ్మకానికి తాజాగా ఐసీసీ ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ కు సంబంధించిన అంపైర్ లిస్ట్ ను విడుదల చేసింది.

Advertisement

ఈ లిస్ట్ చుసిన వెంటనే మ్యాచ్ మనదే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే సినిమాల్లో మాదిరిగానే క్రికెట్ లో నమ్మకాలు అనేవి బాగా ఉంటాయి. అటువంటి నమ్మకాల్లో.. అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఉంటె ఇండియా ఓడిపోతుంది అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతారు. ముఖ్యంగా ఇలా నాక్ ఔట్ మ్యాచ్ లలో అయితే పక్క జరుగుతుంది.

Advertisement

2013 లో ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. ఇప్పటివరకు జరిగిన ఐసీసీ టోర్నీలలో ఇండియా సెమీస్ లేదా ఫైనల్స్ కు వెళ్లి ఓడిన అన్ని మ్యాచ్ లలో రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. కానీ ఈసారి అతను లేకపోవడంతో మనం ఫైనల్స్ కు వెళ్లడం పక్క అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఈ ప్రపంచ కప్ అంపైర్ లిస్ట్ లో ఉన్న రిచర్డ్ కెటిల్ బరో ఒకవేళ ఫైనల్ మ్యాచ్ లో అంపైర్ గా వస్తే ఎలా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి :

35 ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ తో సెమీస్ ఆడుతున్న ఇండియా..!

తన షాట్స్ సీక్రెట్ ఏంటో చెప్పిన సూర్య..!

Visitors Are Also Reading