Home » 35 ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ తో సెమీస్ ఆడుతున్న ఇండియా..!

35 ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ తో సెమీస్ ఆడుతున్న ఇండియా..!

by Azhar
Ad

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఇండియా తన గ్రూప్ బిలో టాపర్ గా సెమీస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ ఏ లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ తో ఇండియా జట్టు సెమీస్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇండియా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ లో తలపడటం అనేది 35 ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Advertisement

ఐసీసీ టోర్నీలలో చివరగా ఇండియా, ఇంగ్లాండ్ జట్లు 1987 వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ లో తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. వాఖండే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 254 పరుగులు చేయగా… లక్ష్య ఛేదనలో ఇండియా 45.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. దాంతో 35 పరుగుల తేడాతో
భారత జట్టు ఓడింది.

Advertisement

ఇక ఆ తర్వాత ఇండియా,ఇంగ్లాండ్ జట్లు చాలాసార్లు.. చాలా ఐసీసీ టోర్నీలలో సెమీస్ లోకి వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా ఎదురుపడలేదు. కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మ్యాచ్ లో రెండు జట్లు ఈ నెల 10న తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఇండియానే ఫెవరెట్ గా ఉంది. ఇప్పటివరకు కూడా అన్ని ఇండియా జట్టుకు కలిసివస్తున్నాయి. కాబట్టి ఇందులో ఇండియా గెలిచి ఫైనల్స్ కు వెళ్తుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ సూర్యనే..!

వచ్చే ప్రపంచ కప్ ఆడే దేశాలు ఇవే..!

Visitors Are Also Reading