Home » Shardul Thakur : మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫోటోలు వైరల్!

Shardul Thakur : మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫోటోలు వైరల్!

by Bunty
Ad

ప్రస్తుతం ఎటు చూసినా పెళ్లిళ్ల హడావిడి కనిపిస్తోంది. యువతి యువకులు బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ క్రమంలో పనిలో పనిగా క్రికెటర్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియ శెట్టిని పెళ్లాడగా, అక్షర్‌ పటేల్‌ ది కూడా ఇటీవలే పెళ్లి జరిగింది.. అటు పాక్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్, ఆ జట్టు హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్ కూతురిని మనవాడాడు. ఇక తాజాగా మరో స్టార్ క్రికెటర్ ఓ ఇంటివాడయ్యాడు.

Advertisement

శార్దూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్ పెళ్లి తాజాగా ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్ చాహల్ భార్య ధనశ్రీ, తదితరులు హాజరయ్యారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న శార్దుల్, మిథాలీ కొన్ని కారణాలవల్ల పెళ్లి ఇప్పుడు చేసుకున్నారు. తాజాగా మ్యారేజ్ జరిగినప్పటికీ కొన్ని రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెహందీ, హల్దీ ఫంక్షన్స్ తో ఇద్దరు బిజీబిజీగా ఉన్నారు.

Advertisement

డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెళ్లి కంటే ముందే సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి తెగ సెర్చ్ చేశారు. ఏదైతేనేం స్టార్ క్రికెటర్ షార్దుల్ ఠాకూర్ తన స్నేహితురాలు మిథాలీని పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. మిథాలీపారుల్కర్ గురించి చెప్పుకుంటే బిజినెస్ ఉమన్ గా పేరు తెచ్చుకుంది. ‘ద బేక్స్’ సంస్థకు ఓనర్ గా ఉంది. ముంబై, థానేలో ఈమెకు బ్రాంచీలు ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మిథాలీకి 5వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు శార్దూల్ ని పెళ్లి చేసుకుంది కాబట్టి పాపులారిటీతో పాటు ఫాలోవర్స్ సంఖ్య కూడా కచ్చితంగా పెరుగుతుంది. మరోవైపు బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్న శార్దూల్ ఠాకూర్ అప్పుడప్పుడు బ్యాట్ తోను మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు.

 

READ ALSO : రాజమౌళికి అల్లు అరవింద్ మీద ఎందుకంత కోపం అంటే..ఆ విషయమే చిచ్చు పెట్టిందా ?

 

Visitors Are Also Reading