Home » Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ.. ఎలా ఉందంటే..?

by Anji
Ad

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బుట్ట‌బొమ్మ పూజా హెగ్దే కాంబోలో తెర‌కెక్కించిన చిత్రం రాధేశ్యామ్‌. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. బాలీవుడ్ ఓల్డ్ హీరోయిన్ భాగ్య‌శ్రీ‌, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజుతో పాటు జ‌గ‌ప‌తిబాబు, ముర‌ళీశ‌ర్మ‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, ప్రియ‌ద‌ర్శి, కునల్ రాయ్ క‌పూర్, వంటి వారు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్ సుమారు 300 కోట్లతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

Advertisement

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌కు మంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ ఈనెల 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రొక వైపు ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊహించ‌ని స్థాయిలో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓవ‌ర్సిస్ సెన్సార్ బోర్డు మెంబ‌ర్, సినీ విశ్లేష‌కుడు ఉమైర్ సంధు రాధేశ్యామ్ సినిమా గురించి ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చాడు.

Advertisement

అస‌లు సిస‌లైన సినిమా అంటే రాధేశ్యామ్ అని కొనియాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఊహించ‌ని విధంగా వైవిద్యంగా ఉంద‌న్నారు. ఈ చిత్రంలో ఉప‌యోగించిన గ్రాఫిక్స్ ప్ర‌త్యేక‌మైన‌వి. ప్ర‌భాస్‌, పూజాహెగ్దేల మ‌ధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదంటూ ఆయ‌న తెలిపారు. ఈ సినిమా క‌థ ఇంత‌వ‌ర‌కు చూడ‌ని విధంగా ఉంటుంద‌ని క్లాస్‌, స్ట‌యిల్‌లో ప్ర‌భాస్‌ను కొట్టే మొన‌గాడు ఇండియాలో మ‌రెవ్వ‌రూ లేర‌ని ఉమైర్ సంధూ ఆకాశానికెత్తాడు. రాధేశ్యామ్ అత్యంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాడ‌ని.. ఈ చిత్రంలో అత‌ని న‌ట‌న ఆహార్యం త‌న‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయ‌ని చెప్పారు.

Also Read :  అమెరికాలో ఎన్టీఆర్ అభిమానుల హవా….థియేటర్ మొత్తం బుక్ చేశారు..!

Visitors Are Also Reading