Home » అమెరికాలో ఎన్టీఆర్ అభిమానుల హవా….థియేటర్ మొత్తం బుక్ చేశారు..!

అమెరికాలో ఎన్టీఆర్ అభిమానుల హవా….థియేటర్ మొత్తం బుక్ చేశారు..!

by AJAY
Published: Last Updated on

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మోరిస్ నటించగా రామ్ చరణ్ కు జోడిగా ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కేసుల కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా మార్చి 25వ తేదీకి వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల నేపథ్యం లో ఎన్టీఆర్ అభిమానులు ఏకంగా ప్రీమియర్ షో కోసం ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. అది కూడా మన దేశం లో కాదు ఏకంగా అమెరికా లోని ఫ్లోరిడా లో ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ మొత్తాన్ని ప్రీమియర్ షో కోసం బుక్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా లండన్ లో అఖండ సినిమా విడుదల సందర్బంగా అభిమానులు చేసిన సందడి గురించి తెలిసిందే. ఏకంగా సినిమా విడుదల రోజున కార్ ర్యాలీ తో అభిమానులు హంగామా చేశారు.

Visitors Are Also Reading