Home » ఉద‌య్ కిర‌ణ్ చనిపోయేముందు ఆ డైరెక్ట‌ర్ తో మాట్లాడిన చివరిమాట‌లు వింటే క‌న్నీళ్లు ఆగ‌వు..!

ఉద‌య్ కిర‌ణ్ చనిపోయేముందు ఆ డైరెక్ట‌ర్ తో మాట్లాడిన చివరిమాట‌లు వింటే క‌న్నీళ్లు ఆగ‌వు..!

by AJAY
Ad

ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న హీరో ఉద‌య్ కిర‌ణ్. సినిమా బ్యాగ్రౌంగ్ లేకున్నా న‌ట‌న పై ఉన్న ఆస‌క్తితో ఉద‌య్ కిర‌ణ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చిత్రం సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ త‌ర‌వాత వ‌రుస సినిమాలు చేసి బిజీగా మారిపోయాడు. త‌న అందంతో ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని అమ్మాయిల మ‌న‌సుదోచుకున్నాడు.

Advertisement

అప్ప‌ట్లో ఉద‌య్ కిర‌ణ్ కు యూత్ లో తెగ క్రేజ్ ఉండేది. అయితే ఎంత త్వ‌ర‌గా హీరోగా ఎదిగాడో అంతే త్వ‌రగా డౌన్ ఫాల్ అయ్యాడు. త‌న జీవితంలో జ‌రిగిన బ్రేకప్ లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల సినిమా ల‌పై ఇంట్రెస్ట్ పెట్ట‌లేక‌పోయాడు. మ‌రోవైపు చిరంజీవి కూతురుతో నిశ్చితార్థం జ‌రిగిన త‌ర‌వాత ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. దాంతో పాటూ ఎన్నో స‌మ‌స్య‌లు ఉద‌య్ కిర‌ణ్ ను చుట్టుముట్టాయి.

Advertisement

చేసిన సినిమాలు వ‌రుస ఫ్లాపులు అవ్వ‌డం తో ఉద‌య్ కిర‌ణ్ డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాడు. అలాంటి స‌మ‌యంలోనే ఉద‌య్ కిర‌ణ్ విశిత అనే సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ను ప్రేమ‌వివాహం చేసుకున్నాడు. పెళ్లి త‌ర‌వాత కూడా సినిమా ఛాన్స్ లు రాలేదు. అప్ప‌టికే అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాత‌లు కూడా వెన‌క్కి తీసుకున్నారు. దాంతో పూర్తిగా డిప్రెష‌న్ లోకి వెళ్లిన ఉద‌య్ కిర‌ణ్ చివ‌రికి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

Uday kiran

Uday kiran

ఇదిలా ఉంటే ఉదయ్ కిర‌ణ్ చ‌నిపోయే ముందురోజు త‌న‌తో మాట్లాడాడ‌ని అతడితో మ‌న‌సంతా నువ్వే సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు విఎన్ ఆదత్య చెప్పారు. తాను బెంగుళూరు లో భార్య‌తో క‌లిసి ప‌బ్ లో ఎంజాయ్ చేస్తున్నాన‌ని చెప్పాడ‌ని అన్నారు. మ‌ళ్లీ ఇద్ద‌రం క‌లిసి ప‌నిచేద్దామ‌న్నా అంటూ త‌న‌తో అన్నాడ‌ని త‌న‌కు ధైర్యం చెప్పాడ‌ని తెలిపాడు. ఉద‌య్ కిర‌ణ్ డిప్రెష‌న్ లో ఉన్నా త‌న‌కు ఆ మాట‌లు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయ‌ని చెప్పాడు.

ALSO READ :

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న 7గురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీరే…!

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, ఆచార్యలో కాజ‌ల్ ల‌కు అన్యాయం..? మెగాఫ్యామిలీ పై దారుణ‌మైన ట్రోల్స్..!

Visitors Are Also Reading