Home » ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, ఆచార్యలో కాజ‌ల్ ల‌కు అన్యాయం..? మెగాఫ్యామిలీ పై దారుణ‌మైన ట్రోల్స్..!

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, ఆచార్యలో కాజ‌ల్ ల‌కు అన్యాయం..? మెగాఫ్యామిలీ పై దారుణ‌మైన ట్రోల్స్..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సందించుకున్నారు. ఏజ్ పెరిగినా వ‌రుస సినిమాలు చేస్తూ కుర్ర‌హీరోల‌తో పోటీప‌డుతున్నారు. ఇక మెగాస్టార్ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. దాంతో వారిని మెగాహీరోస్ అని పిలుస్తుంటారు. అయితే ప్ర‌స్తుతం మెగాస్టార్ అంటే గిట్ట‌నివాళ్లు ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

 

 

ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. అయితే ఈ సినిమా విష‌యంలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా నిరాశ‌చెందారు. రామ్ చ‌ర‌ణ్ కంటే ఎన్టీఆర్ కు సినిమాలో త‌క్క‌వ ప్రాధాన్య‌త ఇచ్చార‌ని మండిప‌డుతున్నారు. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ కు హైప్ ఇచ్చే సీన్ల‌ను కూడా క‌త్తిరించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. చ‌ర‌ణ్ కు మెగాస్టార్ స‌పోర్ట్ ఉంద‌ని ఎన్టీఆర్ కు స‌పోర్ట్ లేక‌పోవ‌డం వ‌ల్లే అలా చేశార‌ని కూడా కొంత‌మంది కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండ‌గానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ఆచార్య సినిమా ఈ నెల 29న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవ‌లే జ‌రిగింది. ఈ సినిమాలో మొద‌ట కాజ‌ల్ అగ‌ర్వాల్ ను చిరంజీవికి జోడీగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే నాలుగు రోజుల షూటింగ్ త‌ర‌వాత సినిమాలో న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టిస్తున్న చిరంజీవికి ల‌వ్ ట్రాక్ పెడితే సెట్ అవ్వ‌దేమో అని కాజ‌ల్ ను త‌ప్పించామ‌ని కొర‌టాల శివ‌ చెప్పారు.

కాగా కాజ‌ల్ తో గొడ‌వ‌లు అవ్వ‌డం వ‌ల్లే ఆమెను ప్రాజెక్టు నుండి త‌ప్పించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో కొంత‌మంది నెటిజ‌న్లు ఆచార్య‌లో కాజ‌ల్ సీన్లు లేపేశారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సీన్ల‌ను లేపేశారు..ఇదందా మెగా మాఫియా అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ALSO READ :

చిరంజీవిని తిట్టిన గూండాలు…వెంట‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లి ఏం చేశాడో తెలుసా..!

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న 7గురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీరే…!

Visitors Are Also Reading