Home » ఉద‌య్ కిర‌ణ్‌ వదిలేసుకున్న 10 సెన్సేష‌న‌ల్ హిట్ సినిమాలు తెలుసా..?

ఉద‌య్ కిర‌ణ్‌ వదిలేసుకున్న 10 సెన్సేష‌న‌ల్ హిట్ సినిమాలు తెలుసా..?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న సృష్టించిన హీరోల్లో ఒకరూ ఉద‌య్‌కిర‌ణ్‌, చిత్రం సీనెంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే భారీ హిట్‌ను అందుకున్న ఉద‌య్ కిర‌ణ్ ఆ త‌రువాత నువ్వునేను, మ‌న‌సంతానువ్వే, క‌లుసుకోవాల‌ని వంటి వ‌రుస విజ‌యాలతో ఇండ‌స్ట్రీకి టాప్ హీరోగా ఎదిగాడు. అప్ప‌ట్లో యూత్‌లో ఉద‌య్ కిర‌ణ్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన అది త‌క్కువే అవుతుంది. అక‌స్మాత్తుగా ఉద‌య్ కిర‌ణ్‌కు వ‌రుస ప్లాప్‌లు రావ‌డం, సినిమా అవ‌కాశాలన్నీ దూర‌మ‌వ్వ‌డం ఆయ‌న‌ను మాన‌సికంగా ఎంతో దిగ్బ్రాంతికి గురి చేసి ఆత్మ‌హ‌త్య చేసుకునే విధంగా చేసింది. ఉద‌య్ కిర‌ణ్ ఆ సినిమాలు చేసి ఉంటే.. ఈరోజు ఆయ‌న రేంజ్ ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో ఉండేది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

హీరో నితిన్ కెరీర్ లో సై సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో హీరో గా తొలుత ఉదయ్ కిరణ్ ని తీసుకోవాలి అనుకున్నాడు అట రాజమౌళి. అప్పటికే ఉదయ్ కిరణ్ బోలెడన్ని సినిమాలకి కమ్మిట్ అవ్వడం వల్ల సై సినిమాను వదులుకోవాల్సి వచ్చింది, ఈ సినిమా ఉదయ్ కిరణ్ చేసి ఉంటే ఆయన కెరీర్ మంచి గా బూస్ట్ అయ్యేది అనే చెప్పొచ్చు.

మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో తన నిర్మాణ సంస్థ అయినా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయ్ కిరణ్ తో ఒక్క సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అప్పట్లో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక్క ఊపు ఊపుతున్న ఆసిన్ ని ఎంచుకున్నారు,ఇక ఈ సినిమా కి దర్శకుడు ఎవరో కాదు. మన పూరి జగన్నాథ్. ఈ సినిమా కూడా అర్థంతరంగా మధ్యలోనే ఆగిపోయిన‌ది.

సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆర్ బీ చౌదరి అప్పట్లో ఉదయ్ కిరణ్, హీరోయిన్ సదా కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రారంభించారు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ బాషలలో ఏకకాలం లో చిత్రకరణ ప్రారంబించుకుంది. కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా పేరు లవర్స్ అని కూడా అప్పట్లో ఖరారు చేశారు.

బాలీవుడ్ లో అప్పట్లో సెన్సషనల్ హిట్ గా నిలిచినా జబ్ వీ మెట్ సినిమాని తెలుగు లో ఉదయ్ కిరణ్, త్రిషలను హీరో హీరోయిన్లుగా పెట్టి తీద్దామ‌నుకున్నారు. ఈ సినిమా కూడా అప్పట్లో షూటింగ్ ప్రారంభ దశలోనే ఆగిపోయింది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ హిందీ లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లు గా నటించారు. అప్పట్లో ఈ సినిమా బాలీవుడ్ ని ఒక‌ ఊపు ఊపింది. ఇదే సినిమా టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ చేసి ఉంటే సంచలన విజయం సాధించి ఉండేది. కానీ పాపం దురదృష్టం కొద్దీ ఈ సినిమా కూడా ఉదయకిరణ్ చేజారిపోయింది.

Advertisement

ఇక ప్రముఖ దర్శకుడు రవి బాబు అప్పట్లో ఉదయ్ కిరణ్, తరుణ్ లను హీరోలు గా పెట్టి ఒక్క సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా లో నటించడానికి తొలుత ఉదయ్ కిరణ్ ఒప్పుకున్నా,ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలీదు కానీ నేను ఈ సినిమాలో నటించడం లేదు అండీ అంటూ రవిబాబు కి చెప్పాడు, అప్పుడు రవిబాబు పంతం వదలకుండా కేవలం తరుణ్ ని పెట్టి సినిమా తీసి హిట్ కొట్టాలని చూసాడు, ఆ సినిమానే సోగ్గాడు, ఈ సినిమా అప్పట్లో పెద్ద ప్లాప్ గ నిలిచింది, వాస్తవానికి ఈ సినిమాని ఇద్దరు హీరోలతో తీసే విధంగా స్క్రిప్ట్ ని రాసుకున్నాడు రవిబాబు, కానీ ఉదయ్ కిరణ్ చివరి నిమిషం లో నటించట్లేదని చెప్పేసరికి ఆ కథలో మార్పులు చేసి తరుణ్ ని పెట్టి తీశాడు. అది బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ కాలేదు.

Also Read : E-Passport : కేంద్రం తీసుకురానున్న కొత్త ఈ-పాస్ పోర్ట్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే..?

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై అప్పట్లో ఏ ఏం రత్నం ఉదయ్ కిరణ్ తో ప్రేమంటే సులువు కాదు రా అనే సినిమాని ప్రారంభించారు. ఈ సినిమాలో తోలి సారిగా ఉదయ్ కిరణ్ ద్విపాత్రాభినయం చేసాడు, దాదాపు 80 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా కారణం లేకుండా మధ్యలోనే ఆపేసాడు నిర్మాత ఏ ఏం రత్నం,మిగిలిన 20 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఉంటే ఉదయ్ కిరణ్ కెరీర్ లో పడ్డ హిట్ గా నిలిచేది ఏమో.

 

 ప్రముఖ దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం లో ఉదయ్ కిరణ్ అప్పట్లో ఒక్క సినిమాని ప్రారంబించాడు, ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఒక్క పవర్ ఫుల్ మిలటరీ ఆఫీసర్ గా దేశ భక్తి గల యువకుడిగా నటించాడు. కొంత భాగం షూటింగ్ ని జరుపుకున్న ఈ చిత్రం కూడా మధ్యలోనే ఆగిపోయింది.


అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన స్వీయ దర్శకత్వం లో తెరకెక్కించాలనుకున్న నర్తన శాల సినిమాలో కూడా ఉదయ్ కిరణ్ ని తీసుకున్నారు, ఇందులో ఉదయ్ కిరణ్ అభిమన్యుడి పాత్రలో నటించాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బాలకృష్ణ ఈ సినిమాని ఆపేయాల్సి వచ్చింది. ఇటీవలే నందమూరి బాలకృష్ణ అప్పటి వరుకు తీసిన కొంత భాగం ని ఓ టీ టీ లో విడుదల చెయ్యగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఉదయ్ కిరణ్ దాదాపు 15 సినిమాలు చేతులారా మిస్ చేసుకున్నాడు. ఇందులో కొన్ని షూటింగ్ 70 శాతం కి పైగా పూర్తి చేసుకున్నవి కూడా ఉన్నాయి.

Also Read : Nani : త‌న సినిమాకు ఏడు విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించిన నాని

Visitors Are Also Reading