Home » Nani : త‌న సినిమాకు ఏడు విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించిన నాని

Nani : త‌న సినిమాకు ఏడు విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించిన నాని

by Anji

క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో వీ, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేసి మిశ్ర‌మ ఫ‌లితాలు అందుకున్నారు. న్యాచుర‌ల్ నాని గ‌త ఏడాది చివ‌రిలో శ్యామ్ సింగ‌రాయ్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో అంటే సుంద‌రానికి అనే సినిమాలో న‌టిస్తున్నాడు. గ‌తంలో మెంట‌ల్ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా లాంటి హిట్ సినిమాలు అందించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Also Read :  వాట్సాప్ లో మరో అద్భుతమైన అప్డేట్…ఒక్క క్లిక్ తో రిప్లై…!

రాజారాణి ఫేం న‌జ్రియా న‌జీమ్ అందించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాజారాణి ఫేం న‌జ్రియా న‌జీమ్ చాలా ఏండ్ల త‌రువాత సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపించ‌నుంది. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్, భీమ్లానాయ‌క్, లాంటి కొన్ని సినిమాలు రెండేసి విడుద‌ల చేసిన తేదీల‌ను ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే.

ఈ త‌రుణంలోనే తామేమి త‌క్కువ కాదంటూ సుంద‌రానికి సినిమా విడుద‌ల కోసం ఏకంగా ఏడు ముహుర్తాలు ఫిక్స్ చేసాడు నాని. ఏప్రిల్ 22, ఏప్రిల్ 29, మే 06, మే 27, జూన్ 03, జూన్ 10 తేదీల్లో ఒక‌రోజు త‌న సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ విడుద‌ల చేసారు నాని. మీరంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయ‌కూడ‌దా..? పుల్ ఆవ‌కాయ సీజ‌న్ బ్లాక్ చేశాం.. మెల్ల‌గా డిసైడ్ చేస్తామంటూ అత‌ను ఫ‌న్నీగా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. అంటే సుంద‌రానికి సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. హాస్య ప్ర‌ధానంగా సాగే క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు తగ్గ‌ట్టే ఇటీవ‌ల విడుద‌లైన గ్లింప్స్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Also Read : E-Passport : కేంద్రం తీసుకురానున్న కొత్త ఈ-పాస్ పోర్ట్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే..?

Visitors Are Also Reading