Home » తెలంగాణలో రెండు భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు..అర్హతలు, ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

తెలంగాణలో రెండు భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు..అర్హతలు, ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కార్. ఇక తాజాగా మరోసారి విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Advertisement

Advertisement

22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడింది. జనవరి 3 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ లో పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in లో చూడవచ్చని పేర్కొన్నారు.

అర్హత:

డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్ & ఎనిమల్ హస్బెండరీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీంతో పాటు పీజీ డిగ్రీ/పిజి డిప్లమా (మైక్రోబయాలజీ/ పారాసైటాలజీ/ ఏపీడిమియోలజీ/ వైరాలజీ /ఇమ్యునాలజీ/ పాథాలజీ) లేదా బయోటెక్నాలజీతో మాస్టర్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్) లేదా వెటర్నరీ పబ్లిక్ హెల్త్ తో మాస్టర్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్).

వయోపరిమితి :

01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి : ధోనీకి షాక్…CSK కెప్టెన్ గా బెన్ స్టోక్స్

Visitors Are Also Reading