మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుట్ర కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాఘవేంద్ర రాజు స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణహాని ఉందని.. శ్రీనివాస్ గౌడ్ తనపై 30 కేసులు పెట్టించారని స్టేట్ మెంట్‌లో రాఘవేంద్రరాజు పేర్కొన్నారు. తన వైన్ షాపును మూసివేయించిన ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇబ్బంది పెట్టారని ఆర్థికంగా కూడా తనకు నష్టం చేయించారని రాఘవేంద్ర రాజు వెల్లడించారు.
Advertisement
Advertisement
ఒకేరోజు తనపై 10 కేసులు పెట్టించారు అని.. తనకు ఏకంగా రూ.6కోట్ల వరకు నష్టం చేశారని వివరించారు. తనకు రావాల్సిన డబ్బులు రాకుండా అడ్డుకున్నారని.. తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేసాడు రాఘవేంద్ర రాజు. 2017 నుంచి తనను చంపేందుకు శ్రీనివాస్ గౌడ్ యత్నం చేశారని.. తనను తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాఘవేంద్ర రాజు ఈ వేధింపులు తట్టుకోలేక నేను శ్రీనివాస్ గౌడ్ ను చంపాలనుకున్నాడని పోలీసులకు రాఘవేంద్ర రాజు వివరించాడు.
Also Read : IPL 2022 : ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. స్టేడియంలో మ్యాచ్‌లు వీక్షించొచ్చు.. కానీ..!