Home » IPL 2022 : ఐపీఎల్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్.. స్టేడియంలో మ్యాచ్‌లు వీక్షించొచ్చు.. కానీ..!

IPL 2022 : ఐపీఎల్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్.. స్టేడియంలో మ్యాచ్‌లు వీక్షించొచ్చు.. కానీ..!

by Anji
Ad

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. మ్యాచ్‌ల‌కు స్టేడియానికి వెళ్లి మ్యాచ్ వీక్షించాల‌నుకునే వారికి అనుమ‌తి ఇవ్వ‌నుంది. అయితే పూర్తి స్థాయిలో కాకుండా కేవ‌లం 25 శాతం మంది మాత్ర‌మే స్టేడియానికి అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. ఐపీఎల్ మార్చి 26 ప్రారంభం కానుంది. మార్చి 02న మ‌హారాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే మ‌రొక మంత్రి ఏక్‌నాథ్ షిండేతో క‌లిసి టోర్న‌మెంట్‌కు సంబంధించి బీసీసీఐ తాత్కాలిక సీఈఓ హేమంగ్ అమిన్, ముంబై క్రికెట్ అసోసియేష‌న్ ముఖ్య అధికారుల‌తో మ‌ల‌బార్ హిల్‌లోని స‌హ్యాద్రి అతిథి గృహంలో స‌మావేశం నిర్వ‌హించారు.

Advertisement

Advertisement

ఐపీఎల్ 2022 లీగ్ ద‌శ కోసం బీసీసీఐ ముంబైలో ఐదు ప్రాక్టీస్ వేదిక‌ల‌ను గుర్తించింది. బీకేసీలోని ఎంసీఏ గ్రౌండ్ క్రికెట్ క్ల‌బ్ ఆఫ్ ఇండియాలోని బ్ర‌బౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, న‌వీ ముంబైలోని రిల‌య‌న్స్ కార్పొరేట్ పార్కు, ఎంసీఏ గ్రౌండ్‌. మార్చి 26న వాంఖ‌డే స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈసారి లీగ్‌లో 12 డ‌బుల్ హెడ‌ర్లు ఉంటాయి. టీమ్‌లు మార్చి 08 నాటికి ముంబై చేరుకునే అవ‌కాశ‌ముంది. ఐపీఎల్ బ‌యో సెక్యూర్ ప్రోటోకాల్స్‌లో భాగంగా.. బ‌బుల్‌లో భాగ‌మ‌య్యే ఆట‌గాళ్లు స‌హాయ‌క సిబ్బంది మ్యాచ్ అధికారులు, వ్యాఖ్యాత‌లు, ప్ర‌సార సిబ్బంది 3-5 రోజుల వ‌ర‌కు నిర్బంధంలో ఉండాలి.

Also Read :  Viral Video : పెళ్లి మండ‌పంలో వ‌రుడి వీరంగం.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading