Home » తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… ఉద్యోగాల రాత పరీక్ష తేదీలపై TSPSC కీలక ప్రకటన

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… ఉద్యోగాల రాత పరీక్ష తేదీలపై TSPSC కీలక ప్రకటన

by Bunty
Ad

తెలంగాణలో ఉద్యోగాస్తులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. కొలువుల జాతర కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. పలు నియామక సంస్థలు ఇప్పటికే భారీగా నోటిఫికేషన్లను విడుదల చేశాయి. అనేక నియామక ప్రక్రియలు కొనసాగుతున్నాయి.

READ ALSO : హైదరాబాద్ లో ఫాక్స్ కాన్ మెగా పెట్టుబడి, 1 లక్ష ఉద్యోగాలు

Advertisement

ఈనెల 15, 16 న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష, ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్, ఏప్రిల్ 23న సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు, రవాణా శాఖలో 113 సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు,

Advertisement

READ ALSO : Manchu Manoj : మోహన్ బాబు సమక్షంలో మంచు మనోజ్ పెళ్లి..ఇదిగో ఫోటోలు

హార్టికల్చర్ ఆఫీసర్ 22 పోస్టులకు గతంలో వేరువేరుగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను తాజాగా ఖరారు చేసింది. అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీలను మాత్రం ప్రకటించలేదు. పూర్తి వివరాలకు టిఎస్పిఎస్సి వెబ్సైట్ ను సందర్శించవచ్చని అభ్యర్థులకు సూచించింది.

READ ALSO : చాలా మంది వాహనాలపై వేసుకునే ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ గురించి ఓ నిజం మీకు తెలుసా ?

Visitors Are Also Reading