Home » ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఇకపై బస్సుల్లో ఉచితంగా వైఫై..!

ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఇకపై బస్సుల్లో ఉచితంగా వైఫై..!

by Anji
Ad

తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు రకాల సేవలను ప్రారంభించిన ఆర్టీసీ తాజాగా హైటెక్ బస్సులను రంగంలోకి దింపుతోంది. తొలి విడత 16 ఏసీ స్లీపర్ బస్సులు ఇప్పటికే హైదరాబాద్ కి చేరుకున్నాయి. ప్రైవేటు బస్సులో ఉండే దాదాపు అన్ని ఫీచర్లు ఈ బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్టణం, తిరుపతి,చెన్నైలో ఈ బస్సులు నడవనున్నాయి.  

Also Read :   Hyderabad : సౌదీ రాజు గిఫ్ట్ గా ఇచ్చిన చీతా గుండెపోటుతో మృతి..!

Advertisement

సోమవారం ఉదయం 9.30గంటలకు కొత్త ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అంజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. లహరి పేరుతో తీసుకొచ్చిన ఈ ఏసీ స్లీపర్ బస్సులకు అత్యాధునిక సాంకేతికను జోడించారు. ప్రయాణికుల యొక్క భద్రత కోసం పెద్ద పీట వేస్తూ.. ట్రాకింగ్ సిస్టమ్ తో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేశారు.  

Advertisement

Also Read :  వయస్సు అయిపోయిన హీరోయిన్లు… ఆంటీ పాత్రలకే పరిమితమా? – అల్లు అర్జున్ హీరోయిన్

TSRTC's new super luxury buses equipped with smart features - Telangana  Today

మొత్తం 12 మీటర్ల పొడవు ఉంటే.. ఏసీ స్లీపర్ బస్సుల్లో 15 లోయర్ బెర్త్ లు 15 అప్పర్ స్లీపర్ బెర్త్ లు ఉంటాయి. బెర్త్ ల వద్ద మొబైల్ చార్జింగ్, రీడింగ్ ల్యాంప్ సౌకర్యం ఉంటుంది. బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. సెక్యూరిటి కెమెరాలతో పాటు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా అందించారు. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ ను ప్రత్యేకంగా అందించారు. 

Also Read :  Bank Holidays April 2023 : వచ్చే నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్… పూర్తి వివరాలు ఇవే…

Visitors Are Also Reading