Telugu News » అక్కా ఇలాంటి ఫోటోలు పెట్టి వ్యాల్యూ తీసుకోకండి… శివజ్యోతి ఫోటో పై నెటిజన్ల కామెంట్స్…!

అక్కా ఇలాంటి ఫోటోలు పెట్టి వ్యాల్యూ తీసుకోకండి… శివజ్యోతి ఫోటో పై నెటిజన్ల కామెంట్స్…!

by AJAY MADDIBOINA

V6 లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తలకు ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 9 గంటల నుంచి అరగంట పాటు ప్రసారమయ్యే ఈ వార్తలకు ఎంతోమంది అభిమానులు అయ్యారు. తీన్మార్ వార్తలు అనే షోలో సావిత్రి ( శివజ్యోతి) తో పాటు బిత్తిరి సత్తి చేసిన సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి రోజువారి వార్తలను తమదైన స్టైల్లో పల్లెటూరి నేపథ్యంలో చెప్పడంతో ఎంతోమంది ఇద్దరికీ అభిమానులు అయ్యారు. ఇక ఈ షోలో శివజ్యోతి కట్టు బొట్టు కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపిస్తూ శివాజ్యోతి ఆకట్టుకుంది.

Ads
Shivajyothi

Shivajyothi

దాంతో శివ జ్యోతిని అందరూ సావిత్రి గానే గుర్తు పెట్టుకున్నారు. అయితే ఈ షో తో పాపులారిటీ వచ్చిన అనంతరం శివజ్యోతి బిగ్ బాస్ సీజన్ 3 లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు శివజ్యోతి ఫైనల్ వరకు కొనసాగింది. అయితే బిగ్ బాస్ పూర్తయిన తర్వాత మాత్రం శివజ్యోతి కట్టుబొట్టు పూర్తిగా మారిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

దానికి కారణం ఆమె ధరిస్తున్న దుస్తులులే అని చెప్పాలి. బిగ్ బాస్ షో తర్వాత హౌస్ లో పలువురు సెలబ్రిటీలు పరిచయం అవ్వడం… ఆ తర్వాత వారితో కలిసి శివ జ్యోతి బయట కూడా ఫంక్షన్లకు పార్టీలకు హాజరవడం లాంటివి చేస్తూనే ఉన్నాం.

Shivajyothi

Shivajyothi

ఇక అప్పటి నుండి శివజ్యోతి కూడా ఫ్యాషన్ దుస్తులు వేసుకోవడం అలవాటు చేసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ నెటిజన్ ఏకంగా మిమ్మల్ని ఇలాంటి దుస్తుల్లో చూడలేకపోతున్నాం అంటూ కామెంట్ చేయడంతో ఆ కామెంట్ వైరల్ అవుతోంది. శివజ్యోతి బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఒక ఫోటో తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు కామెంట్ చేసిన నెటిజన్…. అక్క మీరు ఇలా ఉంటే చూడలము. ఇలాంటి డ్రెస్సులు వేసి మీ వ్యాల్యూ ని తగ్గించుకోండి. మీరు అంటే రెస్పెక్ట్ ఉంది. ఇలా చేస్తే మీరు కూడా ఆ టైపే అనిపిస్తుంది. అక్కా. అంటూ కామెంట్ చేశాడు.

 

Also read : నాడు సెహ్వాగ్‌, ధోని-కోహ్లీల‌ను ఔట్ చేసి ఫేమ‌స్‌..నేడు ప‌ప్పులు అమ్ముతూ.. పాక్ బౌల‌ర్‌..!


You may also like