Home » ద్యావుడా..పుష్ప‌ను ఇలా వాడుకుంటున్నారేంట్రా…!

ద్యావుడా..పుష్ప‌ను ఇలా వాడుకుంటున్నారేంట్రా…!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టించింది. అంతే కాకుండా ఈ సినిమాలో అన‌సూయ‌, సునీల్, రావు ర‌మేష్, మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న‌కు ప్రేక్షుకులు ఫిదా అయ్యారు.

pushpa movie

Advertisement

కేవ‌లం 50 రోజుల్లోనే ఈ సినిమాకు రూ.200 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఇక రీసెంట్ గా ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమా అక్క‌డ కూడా మంచి విజ‌యం సాధించింది. రికార్డు స్థాయిలో వ్య్వూవ్స్ వ‌స్తున్నాయి. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా పుష్ప పాటలు మరియు డైలాగులు వైర‌ల్ అవుతున్నాయి. ఏకంగా ప‌లువురు దేశవిదేశాల క్రికెట‌ర్లు పుష్ప సినిమా డైలాగులు పాట‌ల‌కు వీడియోలు చేస్తున్నారు.

Advertisement

ఇంత‌టి క్రేజ్ ఉన్న పుష్ప‌ను ఓ ఫిజియో థెర‌పీ డాక్ట‌ర్ మాత్రం త‌న ప్ర‌మోష‌న్స్ కోసం ద్యావుడా అనిపించేలా వాడుతున్నాడు. వాడకం అంటే ఇలా కూడా ఉంటుందా అనిపించేలా ఆ డాక్ట‌ర్ వాడ‌కం ఉంది. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ బుజం పైకి లేపి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

అయితే అలా అల్లు అర్జున్ బుజం పైకి లేపిన ఫోటోను సాధార‌ణంగా దిగిన ఫోటోనూ షేర్ ప‌క్క ప‌క్క‌న పెట్టి చికిత్స‌కు ముందు చికిత్స‌కు త‌ర‌వాత అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. డాక్ట‌ర్ పేరు మ‌నోజ్ అని లంకెప‌ళ్లిలో ఈ ఫిజియో థెర‌పీ క్లీనిక్ ఉంద‌ని విజిటింగ్ కార్డులు కొట్టించి ప్ర‌చారం చేసుకోవ‌డం మొదలు పెట్టాడు. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజ‌న్లు ఇదేం వాడ‌కం అయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading