Home » ఈ యాడ్ అవ‌స‌ర‌మా బుట్టబొమ్మా…పూజాపై నెటిజ‌న్లు ఫైర్…!

ఈ యాడ్ అవ‌స‌ర‌మా బుట్టబొమ్మా…పూజాపై నెటిజ‌న్లు ఫైర్…!

by AJAY
Ad

సెల‌బ్రెటీలో ఏం చేస్తే అభిమానులు, ప్రేక్ష‌కులు అదే ఫాలో అవుతుంటారు. అందువ‌ల్లే సెల‌బ్రెటీల‌కు కోట్ల‌కు కోట్లు ఇచ్చి వారిని బ్రాండ్ అంబాసిడ‌ర్ లు గా పెట్టుకుంటారు. అయితే కొంతమంది సెల‌బ్రెటీలు దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని ఏ యాడ్ లు ప‌డితే ఆ యాడ్ లు చేసి డ‌బ్బులు సంపాదిస్తుంటారు. కానీ కొంతమంది సెల‌బ్రెటీలు మాత్రం యాడ్స్ కు దూరంగా ఉంటారు. ఇక కొంద‌రు యాడ్స్ చేసి విమ‌ర్శ‌ల పాలు అవుతుంటారు. రీసెంట్ గా రష్మిక అండ‌ర్ వేర్ యాడ్ చేసి ట్రోల్స్ కు గురైన సంగ‌తి తెలిసిందే. అప్పుడు బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కూడా ఓ యాడ్ చేసి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది.

pooja hegde add

pooja hegde add

పూజా హెగ్డే మ‌ద్యం బాటిల్ కు సంబంధించిన ఓ యాడ్ చేసింది. త‌న ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ యాడ్ ను పోస్ట్ చేసింది. పెయిడ్ పార్ట్న‌ర్ షిప్ అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. వీడియోలో చ‌క్క‌గా బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో మందు పోసుకుని అందులో రెండు ఐస్ ముక్కలు…నీరు పోసుకుని సంబ‌రంగా డ్యాన్స్ చేస్తోంది. ఇక ఈ వీడియో కాస్తా నెట్టింట వైర‌ల్ అవుతోంది. దాంతో నెటిజ‌న్లు ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఏకంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.

Advertisement

Advertisement

also read :చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లి పెళ్లి వేడుక‌లో యానీ మాస్ట‌ర్ సంద‌డి..!

మ‌ళ్లీ ఇలాంటి యాడ్ లు అవ‌స‌ర‌మా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండ‌గా పూజా హెగ్డే ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాధే శ్యామ్ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ఆచార్య సినిమాలో న‌టించింది. ఈ సినిమా కూడా ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా ఇటీవ‌లే అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా విడుద‌లైంది.

Visitors Are Also Reading