Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లి పెళ్లి వేడుక‌లో యానీ మాస్ట‌ర్ సంద‌డి..!

చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లి పెళ్లి వేడుక‌లో యానీ మాస్ట‌ర్ సంద‌డి..!

by AJAY
Ads

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఉపాసన సోదరి అనుష్ పాల పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ పెళ్లి వేడుకలోనే బిజీగా ఉన్నారు. అయితే పెళ్లి వేడుకలో బిజీగా ఉన్న రామ్ చరణ్ తన మరదలి పెళ్లి వేడుకకు సంబంధించిన సంగీత్ బాధ్యతలను ప్ర‌ముఖ లేడీ కొరియోగ్రాఫ‌ర్ యానీ మాస్ట‌ర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జానీ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనను ఆహ్వానించినందుకు రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. 15 సంవత్సరాల నుండి చరణ్ తో అనుబంధం ఉన్నట్టు యానీ మాస్ట‌ర్ పేర్కొన్నారు. ఇక ఈ పెళ్లి వేడుక కోసం మొదటి నుండే కానీ మాస్టర్ తన టీంతో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

Advertisement

ram charan anee master

ram charan anee master

అంతే కాకుండా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. 15 ఏళ్లుగా తనపై నమ్మకం ఉంచినందుకు చ‌ర‌ణ్ కు కృతజ్ఞతలు అంటూ యానీ చ‌ర‌ణ్ తో క‌లిసి దిగిన ఫోటోను స్టోరీ గా పెట్టుకున్నారు. ఇదిలా ఉండ‌గా దోమకొండ లో ఆదివారం సాయంత్రం ఈవెంట్ జరిగినట్టు తెలుస్తోంది. గతంలో తన సోదరి వివాహం లో సైతం యానీ మాస్టర్ సంగీత్ బాధ్యతలను నిర్వహించారు. దాంతో ఇటీవల రామ్ చరణ్ బిగ్ బాస్ కు వెళ్ళిన సమయంలో ఆ విషయాన్ని గుర్తు చేశారు. తనకు మాత్రం ఒక‌రు బాగా తెలుసు అని అది యానీ మాస్ట‌ర్ అంటూ చూపించారు.

Ad

also read : స్మాల్ స్క్రీన్ పై మ‌హేష్ సంద‌డి.. మ‌హేష్ లో మార్పున‌కు కార‌ణం అదేనా?

అంతే కాకుండా యానీ మాస్టర్ చాలా టాలెంటెడ్ అని తన సోదరి పెళ్లి వేడుకలో చాలా భాగా సాంగ్స్ కంపోజ్ చేశార‌ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన యానీ మాస్ట‌ర్ కు మ‌రో పెద్ద ఈవెంట్ ను చ‌ర‌ణ్ అప్ప‌గించారు. ఇదిలా ఉండ‌గా యానీ మాస్ట‌ర్ ఇండ‌స్ట్రీలోనే మంచి లేడీ కొరియోగ్రాఫ‌ర్ గా గుర్తింపుతెచ్చుకున్నారు. ఢీ డ్యాన్స్ షో ద్వారా ఆమె ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక ఇటీవ‌ల బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

Visitors Are Also Reading