Home » “ఆ” అక్షరం తో మెగాస్టార్ సినిమా చేస్తే ఫ్లాపేనా…?

“ఆ” అక్షరం తో మెగాస్టార్ సినిమా చేస్తే ఫ్లాపేనా…?

by AJAY

మెగాస్టార్ చిరంజీవి హీరోగా విడుదలైన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కొరటాల శివ చిరంజీవి సినిమా అంటే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయారని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

అయితే కర్ణుడి చావుకు లక్ష కారణాలు ఉన్నట్టు ఆచార్య హిట్ అవ్వకపోవడానికి కూడా అనేక కారణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదట పూజా హెగ్డే వల్లే ఈ సినిమా పోయింది అని కొందరు ట్రోల్ చేశారు. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ మరియు బీస్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఆచార్యకు కూడా ఫ్లాప్ టాక్ రావడంతో దానికి కారణం పూజాహెగ్డే అని అంటున్నారు.

అదే విధంగా రాజమౌళి తో సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా ఫ్లాప్ ను చూడాల్సిందే అని దాంతో రామ్ చరణ్ కూడా ఆచార్య లో ఉండడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని కొంతమంది వాదన. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

చిరంజీవికి ఆ అనే అక్షరం చిరంజీవికి వచ్చే రాదని కామెంట్స్ చేస్తున్నారు. ఆ లెటర్ తో వచ్చిన ఆరని మంటలు, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఆలయ శిఖరం, ఆరాధన, ఆపద్బాంధవుడు సినిమాలు బోల్తా కొట్టాయని అందుకే మెగాస్టార్ ఆ లెటర్ కు దూరంగా ఉండాలని కొంతమంది వాదిస్తున్నారు.

ALso read  :

పెళ్లి త‌ర‌వాత గొడ‌వ‌లు రాకుండా ఉండాలంటే ముందే ఈ 5 జాగ్ర‌త్తలు తీసుకోండి..!

ఆచార్య ఫ్లాప్ అవుతుంద‌ని షూటింగ్‌లోనే చిరు చెప్పారా..? కొర‌టాల ఏమ‌న్నాడంటే..?

Visitors Are Also Reading