Home » వేణు మాద‌వ్ సినిమాలతో ఎంత‌ సంపాదించారు..?ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది..!

వేణు మాద‌వ్ సినిమాలతో ఎంత‌ సంపాదించారు..?ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లెజండ‌రీ క‌మెడియ‌న్ ల‌లో వేణు మాద‌వ్ ఒక‌రు. న‌ల్గొండ జిల్లాకు చెందిన వేణు మాద‌వ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొద‌లు పెట్టారు.

venu-madhav-wife-1

Advertisement

చాలా చిన్న స్టేజ్ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చూస్తేనే న‌వ్వొచ్చేలా క‌నిపించే వేణు మాద‌వ్ ఎన్నో అవ‌కాశాల‌ను ద‌క్కించుకున్నారు. స్టార్ క‌మెడియ‌న్ రేంజ్ కు ఎదిగారు. హీరోగానూ న‌టించి వేణు మాద‌వ్ మెప్పించారు. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే వేణు మాద‌వ్ అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించారు.

Also read: ASHU REDDY : అందం చూడ‌మంటే కారు చ‌లాన్లు చూశారు..అడ్డంగా బుక్కైన అష్షు రెడ్డి..!

అయితే వేణు మాద‌వ్ కు భార్య ఇద్ద‌రు కుమారులు ఉన్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా వేణు మాదవ్ భార్య కుమారులు ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు చేశారు. వేణు మాద‌వ్ కు ప‌దెక‌రాల పొలం ఉంద‌ని ఆ పొలం నుండే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బియ్యం పంపించేవార‌ని అన్నారు. అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫామ్ లో పండిన కూర‌గాయల‌ను త‌మకు పంపించేవార‌ని చెప్పారు. ఇప్ప‌టికీ కూడా త‌మ‌కు నాగ‌బాబు మ‌రియు ప‌వ‌న్ క‌ల్యాణ్ లు ఫోన్ చేస్తార‌ని బాగోగులు తెలుసుకుంటార‌ని చెప్పారు.

Advertisement

ఇక వేణు మాద‌వ్ బ్ర‌తికి ఉన్న రోజుల్లో ఆయ‌న ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో త‌న‌కు కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయ‌ని చెప్పేవారు. ట్విన్ సిటీస్ లో స్థ‌లాలు ఉన్నాయ‌ని అనేవారి దాని గురించి యాంక‌ర్ ప్ర‌శ్నింగా వేణు మాద‌వ్ స‌తీమ‌ని ఆస‌క్తిక‌ర సమాధానం ఇచ్చారు. కోట్ల రూపాయ‌లు లేవ‌ని కానీ త‌న భ‌ర్త సినిమాల్లోకి వ‌చ్చాక సంపాదించార‌ని అన్నారు. సినిమాల వ‌ల్ల‌నే ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు.

Also Read: ఈ డైరెక్ట‌ర్లు వారి వారి సినిమాల్లో ఇలా క‌నిపించారు! మీరు గ‌మ‌నించారా?

ఇక వేణు మాద‌వ్ కుమారులు ఇద్ద‌రు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇద్ద‌రు కుమారుల్లో ఒక‌రు న‌ట‌న వైపు మ‌రొక‌రు ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేయాల‌ని చూస్తున్న‌ట్టు చెప్పారు. బ్ర‌హ్మానందం కు మ‌రియు వేణు మాద‌వ్ కు గొడ‌వ‌లు ఉన్నాయ‌ని కూడా అప్ప‌ట్లో వార్త‌లు వినిపించేవి అయితే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు లేవ‌ని ఇద్ద‌రూ స‌రదాగా తిట్టుకునే వారని వేణు మాధవ్ స‌తీమ‌ణి వెల్ల‌డించారు.

Visitors Are Also Reading