Home » చెల్లి దారిలోనే చందమామ…సినిమాలకు ఇక సెలవు…!

చెల్లి దారిలోనే చందమామ…సినిమాలకు ఇక సెలవు…!

by AJAY
Ad

అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2007లో లక్ష్మీకళ్యాణం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ చందమామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ తరవాత కాజల్ ఏకంగా రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

Advertisement

ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో కాజల్ అందం మరియు అభినయంతో ఆకట్టుకుంది. యువరాణి పాత్రలో నటించిన కాజల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన కాజల్ సినిమాలు చేసింది.

Advertisement

 

Kajal Agarwal

Kajal Agarwal

ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రీసెంట్ గా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాజల్ ఆచార్య సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించగా ఆ తర్వాత ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు కాజల్ పలువురు దర్శక నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు కాజల్ కూడా తన కూతురి ఆలనాపాలనా దృష్టిలో పెట్టుకుని సినిమాలకు గుడ్ బై చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కాజల్ నోరు విప్పాల్సిందే.

Visitors Are Also Reading