Home » త్రివిక్రమ్ శ్రీనివాస్ సరదాగా చెప్పిన ఈ డైలాగ్ గుర్తుందా ! ఇప్పుడు అదే నిజం అయ్యిందా ?

త్రివిక్రమ్ శ్రీనివాస్ సరదాగా చెప్పిన ఈ డైలాగ్ గుర్తుందా ! ఇప్పుడు అదే నిజం అయ్యిందా ?

by AJAY
Ad

పెంపుడు జంతువుల్లో కుక్క‌లను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఎక్కువ మంది పెంచుకునేవి కూడా కుక్క‌లే. కుక్క మ‌నిషికి ఆదిమాన‌వుడి కాలం నుండి మంచి పెంపుడు జంతువుగా ఉంది. అప్ప‌ట్లో వేట కోసం కుక్కల‌ను ఉపయెగించేవారు. కానీ ఇప్పుడు మ్యాన్ బెస్ట్ ఫ్రెండ్ డాగ్ అంటున్నారు. చాలా మంది కుక్క‌ల‌తోనే గ‌డుపుతారు. దాని వ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌త కూడా దొరుకుంది. అవి చేసే ప‌నులు చూసి మురిసిపోతుంటారు.

Advertisement

సెల‌బ్రెటీల ఇండ్ల‌లో అయితే ప‌ది ప‌దిహేను కుక్కుల‌ను పెంచుకోవ‌డం చూస్తుంటాం. ఇక చిన్న‌పిల్ల‌లు అయితే వాటితో ఆడుకోవ‌డానికి తెగ ఇష్ట‌ప‌డ‌తారు. ఇదిలా ఉంటే ఇక్క‌డ ఓ బుడ్డోడు కూడా ఓ కుక్క పిల్ల అనుకుని న‌క్కపిల్ల‌ను తెచ్చి పెంచుకున్నాడు. అయితే అది పెరుగుతున్న క్ర‌మంలో దానిలోన మార్పుల‌ను చూసి అది అది న‌క్క అని తెలుసుకున్నారు. కుక్క పిల్ల అని తెచ్చుకున్న జంతువు పెరుగుతుండగా అది మొర‌గ‌టంలో తేడాలు క‌నిపించాయి.

Advertisement

అది కుక్క‌లా కాకుండా న‌క్క‌లా మొర‌గ‌టం ఏడ‌వ‌టం గ‌మ‌నించారు. చివ‌రికి అది న‌క్క అని తెలిసి అవాక్క‌య్యారు.ఈ ఘ‌ట‌న బెంగుళూరులోని కెంగేరిలో చోటు చేసుకుంది. ఓ కుటుంబానికి కుక్క‌లు అంటే ఇష్టం ఉండ‌టంతో ఆరు నెల‌లుగా ఓ బుజ్జి కుక్క పిల్ల‌ను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. కానీ అది మొర‌వ‌డం అచ్చం న‌క్క‌లా ఉండ‌టంతో అనుమానం వ‌చ్చింది.

ప‌శువుల వైద్యుడి ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్ల‌గా అది కుక్క కాదు న‌క్క అని చెప్పాడు. దాంతో వాళ్లు షాక్ అయ్యారు. ఇక ఆ న‌క్క‌ను ఫారెస్ట్ అదికారులు తీసుకువెళ్లారు. ఇక ఇలాంటి సీన్ ఒక‌టి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నువ్వునాకు న‌చ్చావ్ సినిమాలోని ఓ సీన్ లో కూడా క‌నిపిస్తుంది. వెంక‌టేష్ గుర్రం బొమ్మ వేస్తున్న‌ప్పుడు ఆర్తీ అగ‌ర్వాల్ పింకీ క‌లిసి దాన్ని చూసి కుక్క బాగుంది అంటారు. దాంతో వెంక‌టేష్ షాక్ అయ్యి అది కుక్క కాదండీ గుర్రం అని చెపుతాడు. ఇక ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే బ‌య‌ట కూడా జ‌ర‌గ‌టంతో ఆ మూవీ సీన్ ను జోడించి ట్రోల్ చేస్తున్నారు.

Visitors Are Also Reading