సమాజం లో ట్రాన్స్ జెండర్ లను చిన్న చూపు చూసే వాళ్లు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం చాలా రంగాల్లో ట్రాన్స్ జెండర్ లు సత్తా చాటుతున్నారు. సినిమాలు రాజకీయాలు, ఉద్యోగాలు ఇలా అన్నింటిలోనూ ట్రాన్స్ జెండర్ లు పోటీ పడుతున్నారు. ఇక తాజాగా తమిళనాడు లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఎన్నికల్లో మొదటి సారి ఓ ట్రాన్స్ జెండర్ విజయం సాధించింది. 20 ఏళ్లుగా గంగా నాయక్ డీఎంకే పార్టీలో కొనసాగుతోంది.
Advertisement
Advertisement
కాగా వెల్లూరు నగర పాలక సంస్థ 37వ అభ్యర్థిగా పోటీ చేసి ఆమె విజయం సాధించారు. ట్రాన్స్ జెండర్ తమిళ నాట స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ఇదే మొదటి సారి. ఇక ఆమె విజయం తో ట్రాన్స్ జెండర్ లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ కాలంలో ట్రాన్స్ జెండర్ గంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు. అంతే కాకుండా తన నాటక బృందం తో కలిసి కరోనా పై అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించారు.