Telugu News » నిహారిక‌కు స‌పోర్ట్ గా ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా.. వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!

నిహారిక‌కు స‌పోర్ట్ గా ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా.. వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!

by AJAY MADDIBOINA

రాడిస‌న్ హోట‌ల్ పుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌లో వెలుగు చూసిన‌ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. పోలీసుల దాడుల్లో ప‌ట్టుబ‌డిన వారిలో ప్ర‌ముఖుల పిల్ల‌లు కూడా ఉండ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ముఖ సినీన‌టుడు నాగ‌బాబు కూతురు నిహారిక కూడా ఆ రోజు రాత్రి స‌మ‌యంలో ప‌బ్‌లో క‌నిపించారు. ముఖ్యంగా పోలీస్ స్టేష‌న్‌లో ఆమె పోన్‌లో మాట్లాడుతున్న వీడియోలు వైర‌ల‌య్యాయి.

Ads

ఈ త‌రుణంలో మెగా ఫ్యామిలీ సామాన్య ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌ల‌నే ఎదుర్కున్న‌ది. నాగ‌బాబు ఓ వీడియో విడుద‌ల చేశారు. త‌న కుమార్తె త‌ప్పు ఏమి లేద‌ని.. పోలీసులు చెప్పిన‌ట్టు వివ‌రించారు. మ‌రొక వైపు ఈ కేసుకు సంబంధించి ఈకేసులో కొన్ని అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండ‌గా.. బిగ్‌బాస్ కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి స్పందించారు. ఎవ‌రో ఒక‌రు చేసిన త‌ప్పుకు ప‌బ్‌కు వెళ్లిన వారంద‌రినీ దొంగ‌ల మాదిరిగా చూడ‌డం స‌రికాదు అన్నారు.

ప‌బ్‌కు వెళ్ల‌డ‌మే త‌ప్పు అనే విధంగా నిహారిక‌పై బుర‌ద చ‌ల్లుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఫ్రెండ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ కోస‌మే నిహారిక ప‌బ్‌కు వెళ్లింద‌ని చెప్పారు. ముఖ్యంగా నిహారిక‌ను టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వ‌స్తుండ‌డం దారుణం అన్నారు. నిహారిక డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టు పోలీసులు చెప్ప‌లేద‌న్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం బాధ‌క‌ర‌మ‌ని ట్రోల్ చేసిన వారిని అడ్డుకుంటామ‌న్నారు. నిహారిక ఫ్యామిలీని టార్గెట్ చేయ‌డం మానుకోవాల‌ని త‌మన్నా కోరారు.

Also Read :  అలీ రేజా రెండేండ్లు టెలివిజ‌న్ ఇండ‌స్ట్రీకి దూరంగా ఎందుకు ఉన్నారో తెలుసా..?


You may also like