సినిమా కథ బాగుండి ఒక భాషలో సూపర్ హిట్ అయితే అదే కథతో ఇతర భాషల్లో కూడా సినిమాను చేస్తే వాటిని రీమేక్ సినిమాలు అంటారు. ఇప్పడంటే హిట్ టాక్ వస్తే అన్ని డబ్ చేసి విడుదల చేస్తున్నారు కానీ మొన్నటి వరకూ డబ్ చేయడం కంటే ఎక్కువగా రీమేక్ లే కనిపించేవి.
Also Read: Unstoppable 2 : బాలయ్య టాక్ షోకి వైఎస్ షర్మిల..?
Advertisement
అయితే అలా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను మూడు భాషల్లోనూ రీమేక్ చేశారు. అంతే కాకుండా అలా రీమేక్ అయిన సినిమాలలో మన టాలీవుడ్ సినిమాలే సగం ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….
రవితేజ కెరీర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలలో కిక్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరవాత కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేశారు.
అంతే కాకుండా ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన రెడీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ అవ్వడంతో హిందీ, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేశారు.
Advertisement
అంతే కాకుండా ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమాను కూడా ఇతర భాషల్లో రీమేక్ చేశారు. బెంగాలీ, ఒడియా భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించాయి.విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను కూడా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చేయగా మంచి విజయం సాధించాయి.
మహేశ్ బాబుకు మాస్ హిట్ ను అందించిన ఒక్కడు సినిమాను కూడా ఇతర భాషల్లో రీమేక్ చేశారని చాలా మందికి తెలియదు. ఈ సినిమాను తమిళ, హిందీ, కన్నడతో పాటూ మరికొన్ని భాషల్లో రీమేక్ చేశారు.
ఈ సినిమాలతో పాటూ మర్యాదరామన్న, పోకిరి, బిల్లా, విక్రమార్కుడు, వర్షం, బొమ్మరిల్లు, నువ్వొస్తాంటే నేనొద్దంటానా సినిమాలను కూడా ఇతర భాషల్లో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు.
Also Read:Avatar 2 Trailer : అవతార్ 2 ట్రైలర్.. విజువల్స్ వండర్