Home » Avatar 2 Trailer : అవతార్ 2 ట్రైలర్.. విజువల్స్ వండర్

Avatar 2 Trailer : అవతార్ 2 ట్రైలర్.. విజువల్స్ వండర్

by Anji
Ad

హాలీవుడ్ సినిమా అవతార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాను సినీ ప్రియులు ఎవ్వరూ కూడా మరిచిపోలేరు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచమే చూపించాడు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్ అవతార్ కి సీక్వెల్ గా వస్తున్న సినిమాకి అవతార్ దివే  ఆఫ్ వాటర్. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా టీమ్ తాజాగా ట్రైలర్ ని విడుదల చేసింది. 

Advertisement

ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. విజువల్ వండర్స్. భారీ సెట్టింగులు, యాక్సన్స్ ఇలా మొత్తానికి అదిరిపోయింది. మరోసారి పండోరాకు తీసుకెళ్లారు. దర్శకుడు జేమ్స్ కామారాన్. ప్రతి సన్నివేశం అదిరిపోయింది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్స్, గ్రాఫిక్స్ ఇలా ఒకటి ఏంటి అంతా అదుర్సే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  ఈ సినిమా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  

Also Read :   ఆ ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్‌.. హీరోయిన్ ఎవ‌రంటే..?

Advertisement

తాజాగా అవతార్ సినిమా రీజనల్ లాంగ్వేజ్ కి భారీగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. తెలుగు రైట్స్ కోసం స్టార్ డిస్ట్రిబ్యూటర్స్  పోటీ పడుతున్నట్టు ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కు రూ.120 కోట్లు వరకు రేటు పలుకుతున్నట్టు సమాచారం. ఇద్దరు ముగ్గురు కలిసి అవతార్ సినిమాను తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమా తొలి రోజే భారీ ఓపెనింగ్స్ ఉంటాయని, ముప్పై నుంచి నలభై కోట్ల దాకా రికవరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తే వీకెండ్ లో రూ.100 కోట్లకు వెళ్లినా ఆశ్చర్యంలేదంటున్నారు.  ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందో అవతార్ 1 విషయానికి వస్తే ఈ చిత్రాన్ని 1994లో రాయడం ప్రారంభించి షూటింగ్ పూర్తయ్యేవరకు 15 ఏళ్లకు పైగా సమయం పట్టింది. దాదాపు 237 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లోనే 3 బిలియన్ యూఎస్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది. ఇక అవతార్ సిరీస్ నుంచి వరుసగా సీక్వెల్స్ విడుదల కానున్నాయి. తేదీలను కూడా కామెరూన్ ఫిక్స్ చేసిన విషయం విధితమే. 

Also Read :  రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు..ఎవ‌రెవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే..?

 

Visitors Are Also Reading