ఇండస్ట్రీలో హీరోలుగా ఎదగడం చాలా కష్టం. అందం, యాక్టింగ్ తో పాటు ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం. హైట్, వెయిట్, హెయిర్, పర్సనాలిటీ చాలా ముఖ్యం. హీరోలు మెయింటైన్ చేసే విధానాన్ని చాలామంది వ్యక్తులు బయట కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో హీరోలు చూడడానికి చాలా అందంగా, ఫిట్ గా ఉన్నప్పటికీ హెయిర్ విషయంలో మాత్రం జుట్టు చాలా పలుచగా ఉంటుంది. అందులో చాలామంది హీరోలు కూడా ఉన్నారు. విగ్గు పెట్టుకొని సినిమాలలో నటిస్తూ ఉంటారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచుతారు. అలాంటి హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం….
Advertisement
# మహేష్ బాబు
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. మహేష్ బాబు హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. అతని హెయిర్ స్టైల్ ని బయట కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అయితే మహేష్ బాబుది ఒరిజినల్ హెయిర్ కాదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మహేష్ బాబు ఫిక్సింగ్ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడని ఇది సహజంగానే కనిపిస్తుందని సమాచారం.
# ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన సొంత హెయిర్ తో సినిమాల్లో నటించడు. మిర్చి సినిమా నాటికే తన జుట్టు చాలా పలచబడిందని సమాచారం. బాహుబలి సినిమా కోసం ఆయన జుట్టును చాలా పెంచారు. హెయిర్ పొడవుగా ఉండడం వల్ల జుట్టు ఎక్కువగా కనిపించిందని అయితే ప్రభాస్ కూడా ప్యాచ్ విగ్ ని వాడుతున్నాడని, ఆ హెయిర్ తనకి అంతగా సెట్ అవ్వడం లేదట.
# రామ్
దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి హీరో రామ్ పోతినేని రెండుసార్లు హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో విగ్గుని వాడుతున్నాడట.
# జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ కి రాఖీ సినిమా సమయంలోనే చాలా హెయిర్ కోల్పోయడట. హెయిర్ ప్లాంటేషన్ ద్వారా అతని హెయిర్ మళ్లీ సరి చేయడం జరిగింది. అయినప్పటికీ ఎన్టీఆర్ చాలా సినిమాల్లో ప్యాచ్ హెయిర్ విగ్గుని వాడాడని… అతని సినిమాల్లో చూస్తే అర్థమవుతుంది.
# అల్లు అర్జున్
అల్లు అర్జున్ విషయానికి వస్తే… ఆర్య మూవీలో కలరింగ్ చేయించడం వల్ల హెయిర్ అంతా కోల్పోయాడట. అప్పటినుండే హెయిర్ ప్యాచెస్ ని వాడుతూ చాలా సినిమాల్లో విగ్గులను వాడుతున్నాడట.
Advertisement
# సూర్య
గజినీ సినిమా టైంలో సూర్య హెయిర్ పలచబడడంతో ఆ సినిమా తర్వాత మూడుసార్లు దుబాయ్ కి వెళ్లి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడని… అందువల్లనే సూర్యకి హెయిర్ చాలా ఎక్కువగా కనిపిస్తుందని సమాచారం. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో డిఫరెంట్ లుక్ కోసం ప్యాచెస్ ని వాడుతూ ఉంటాడట.
# విజయ్
హీరో విజయ్ కూడా 8 సంవత్సరాల నుంచి తనకి సెట్ అయ్యే హెయిర్ ప్యాచెస్ ని వాడుతున్నాడట. ఇన్ని రోజులు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ రీసెంట్ గా తను నటించిన సినిమాల్లో తన హేయిర్ చూస్తే తను ప్యాచెస్ ని వాడుతున్నాడని మనకు తెలిసిపోతుంది.
# చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 67 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ తన ఎనర్జీని ఏమాత్రం తగ్గించకుండా స్టార్ హీరోలు అందరికీ పోటీగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు బయట తిరగడం వల్ల చిరంజీవి చాలా హెయిర్ నీ కోల్పోయాడట. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే సమయంలో తనకి సెట్ అయ్యే విగ్గుని చేయించుకొని ఇప్పటికీ సినిమాల్లో దానినే వాడుతూ చాలా నేచురల్ లుక్ వచ్చేలా కనిపిస్తున్నాడు.
# గోపీచంద్
హీరో గోపీచంద్ హీరో చాలా పలుచబడి ఉండడం వల్ల అతను హెయిర్ ప్యాచెస్ ని పెట్టుకున్నట్లు మనము తెలుసుకోవచ్చు. అందువల్లనే గోపీచంద్ సినిమాకి ఓకే చెప్పేముందు వర్షం సీన్లు కానీ, స్విమ్మింగ్ పూల్ సీన్లు కానీ ఉండకూడదు అని చెప్పి సినిమాకి ఓకే చెబుతాడట.
# వెంకటేష్
విక్టరీ వెంకటేష్ చాలా సినిమాల్లో హెయిర్ ప్యాచెస్ ని పెట్టుకొని చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించవచ్చని 15 సంవత్సరాల ముందే ట్రెండ్ ని క్రియేట్ చేశాడు. అందుకే వెంకటేష్ గారి హెయిర్ ప్యాచ్ హెయిర్ లా కాకుండా చాలా నెచురల్ గా కనిపిస్తూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!
అసలు హర్షసాయి ఎవరు..? ఎలా ఫేమస్ అయ్యాడు
భర్తని…భార్య శారీరకంగా దూరం పెడితే… ఆ ప్రమాదం తప్పదు