Home » టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి ఫిక్స్ .. ఎప్పుడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి ఫిక్స్ .. ఎప్పుడంటే..?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఇటీవలే సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న వెంకటేష్ పారితోషికం రూ.10 నుంచి 13 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమా బడ్జెట్ కి అనుగుణంగా వెంకటేష్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే స్టార్ హీరో వెంకటేష్ రెండో కూతురు పెళ్లి ఫిక్స్ అయినట్టు సమాచారం.

Advertisement

గత ఏడాది అక్టోబర్ వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. వెంకటేష్ రెండో కూతురు పేరు హయవాహి కాగా.. రామానాయుడు స్టూడియో వేదికగా ఈ శుభకార్యం జరుగనున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పెళ్లి వేడుక జరుగనున్నట్టు సమాచారం. హయవాహి కాబోయే భర్త డాక్టర్ అని సమాచారం. వెంకటేష్ దంపతులకు ముగ్గురు కూతుర్లు. ఒక కొడుకు. మార్చి 15న పెళ్లి వేడుక జరుగనుంది. సన్నిహితులను మాత్రమే వెంకటేష్ ఫ్యామిలీ ఈ వేడుకకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

Advertisement

పెళ్లి ఫొటోలు విడుదలైన తరువాత ఈ వేడుకకు సెలబ్రిటీల గురించి క్లారిటీ వచ్చే అవకాశాలుంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల ఫ్యామిలీలు వరుసగా పెళ్లికి సంబంధించిన శుభవార్తలు చెబుతున్నాయి. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత వివాహం 2019లో జరిగింది. వెంకటేష్ చిన్న కూతురు పేరు భావన కాగా.. కొడుకు పేరు అర్జున్. వెంకటేష్ కుమారుడు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read :   సూర్య కంటే జ్యోతిక అంత సంపాదించిందా..?

Visitors Are Also Reading