Home » సూర్య కంటే జ్యోతిక అంత సంపాదించిందా..?

సూర్య కంటే జ్యోతిక అంత సంపాదించిందా..?

by Anji
Ad

హీరో సూర్య తెలుగు స్టార్ కాకపోయినా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫేమస్ స్టార్ గా ఎదిగాడు. తెలుగు స్టార్స్ ఎలా అయితే ఇతర భాషల్లో రాణిస్తున్నారు. అలాగే తమిళ స్టార్ సూర్య తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు హీరోగా నిర్మాతగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ని అందుకుంటున్నారు. మొదట్లో కెరీర్ కాస్త నెమ్మదిగా సాగిన తరువాత మంచి సినిమాలతో ముందుకు దూసుకెళ్లారు గజినీ మూవీతో తెలుగులో సూర్య హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సింగం సిరీస్ తో తెలుగులో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సూర్యకి తెలుగులో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారంటే, దానికి కారణం ఆయన చేసే ప్రయోగాలతో కూడిన సినిమాలే అని చెప్పవచ్చు.

Advertisement

సూర్య భార్య జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. తన అందంతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు జ్యోతిక. తెలుగులో కూడా జ్యోతిక కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో చంద్రముఖి సినిమాతో జ్యోతిక నటనకు, ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. సూర్య జ్యోతిక ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తమ అభిమానులతో జ్యోతిక టచ్ లోనే ఉంటారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలను పక్కన పెట్టి పిల్లలపై దృష్టి పెట్టారు జ్యోతిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ప్రత్యేకమైన పాత్రలో నటిస్తూ హిట్లర్ తన ఖాతాలో వేసుకుంటున్నారు జ్యోతిక. ఇప్పటి వీరిద్దరి ఆస్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి ఇప్పుడు వాటి గురించి  తెలుసుకుందాం.

Advertisement

సూర్య ప్రతి సినిమాకు రూ.25 నుండి రూ.30 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటారని టాక్. సూర్య జ్యోతిక ఆస్తి మొత్తం రూ.537 కోట్లు ఉంటుందని సమాచారం ఇందులో సూర్య ఆస్తివాట రూ.206 కోట్లు కాగా ఇక జ్యోతిక ఆస్తి విలువ రూ.330 కోట్లుగా ఉంటుందని అంచనా దీనిని బట్టి చూస్తే సూర్య కంటే జ్యోతికే బెటర్ అని ఆస్తి విలువలో భర్త కంటే భార్య ఎక్కువ ఆస్తి సంపాదించారని తెలుస్తుంది. ఇటీవల ఇద్దరు ముంబైలో రూ.70 లక్షల విలువ కలిగిన బంగ్లాను కొన్నట్టు తెలుస్తుంది చెన్నైలో పెద్ద భవంతి కూడా ఉంది దాని విలువ కొన్ని వందల కోట్లు ఉంటుందని అంచనా ఇక నిర్మాణ సంస్థ కూడా ఉంది వీరి పేరు మీద సూర్య కన్నా జ్యోతిక ఆస్తి ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

Also Read :   మహేష్ బాబు, రాజమౌళి సినిమా క్రేజీ అప్డేట్.. రాజమౌళి ప్రెస్ మీట్ ఎప్పుడంటే..?

Visitors Are Also Reading