Home » హైదరబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రెండో స్థానంలో సర్కారువారిపాట..టాప్ 5 స్థానాల్లోని సినిమాలు ఇవే..!

హైదరబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రెండో స్థానంలో సర్కారువారిపాట..టాప్ 5 స్థానాల్లోని సినిమాలు ఇవే..!

by AJAY
Ad

టాలీవుడ్ సినిమాలకు హైదరాబాద్ అనేది అసలైన మార్కెట్ అనే చెప్పాలి. హైదరాబాద్ లోనే సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. ముఖ్యంగా వీకెండ్స్ లో సినిమాల కలెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఏ సినిమా విడుదలైనా అడ్వాన్స్ బుకింగ్ లు ఎక్కువగా జరిగేది కూడా ఎక్కువగా హైదరాబాద్ లోనే అని చెప్పాలి. కాగా హైదరాబాద్ లో ఐదు తెలుగు సినిమాలు అత్యధిక బుకింగ్స్ రాబట్టి టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. ఆ ఐదు సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం

Advertisement

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు 10.5 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి.

Advertisement

మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి 6.60 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లు జరిగాయి.

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజిఎఫ్ చాప్టర్-2 సినిమాకు హైదరాబాదులో 6.56 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి.

Bheemla nayak dialogues

Bheemla nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు 6.30 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లో జరిగాయి.

radhe shyam

radhe shyam

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు 6.28 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లు జరిగాయి.

Visitors Are Also Reading