Home » సినిమాల్లో మాదిరిగా వేరే కులం వాళ్ళను ప్రేమించి పెళ్లాడిన హీరోలు వీరే…!

సినిమాల్లో మాదిరిగా వేరే కులం వాళ్ళను ప్రేమించి పెళ్లాడిన హీరోలు వీరే…!

by AJAY
Ad

సినిమాల్లో హీరోలు కులాలు మతాలు పక్కన పెట్టేసి నచ్చిన అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇక సినిమాలతో పాటు నిజజీవితంలోనూ పలువురు హీరోలు కులాల పట్టింపులకు పోకుండా నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. అలా ఇతర కులాలకు చెందిన అమ్మాయిలను పెళ్లాడిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Pawan kalyan wife

Pawan kalyan wife

పవన్ కల్యాణ్

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదట విశాఖకు చెందిన నందిని అనే యువతిని పెళ్లి చేసుకోగా కొంతకాలానికి ఇద్దరికి మనస్పర్థలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత తనతో సినిమాలు చేసిన రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అనేక కారణాల వల్ల వీరిద్దరు కూడా విడిపోవాల్సి వచ్చింది. ఇక పవన్ ప్రస్తుతం ఏకంగా విదేశీయురాలు అయినా అన్నా లేజొనోవా ను పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అల్లు అర్జున్ కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు. కాగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్నేహా రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

రామ్ చరణ్

Advertisement

రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ఉపాసన కొణిదెల ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. రామ్ చరణ్ కాపు సామాజిక వర్గానికి చెందగా…ఉపాసనా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు.

నాగార్జున

అక్కినేని నాగార్జున మొదట రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు. కానీ నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1989లో కిరాయి దాదా సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున అమల తో ప్రేమలో పడ్డారు. దాంతో ఉత్తరాదికి చెందిన అమలని నాగార్జున పెళ్లి చేసుకున్నారు.

Nagachithanya 

నాగ చైతన్య

నాగ చైతన్య ఏమ్మయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో సమంతతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ ముదిరి పోయింది. ఇక సమంత కేరళకు చెందిన క్రిస్టియన్ కాగా నాగ చైతన్య కాపు సామాజిక వర్గానికి చెందిన వారు.

మహేష్ బాబు

మహేష్ బాబు సైతం ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు. మొదట వీరి పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ నిరాకరించినప్పటికీ ఆ తరవాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Visitors Are Also Reading