అమెరికా సంబంధాలు..ఎన్నారై లు అంటే సాధారణ అమ్మాయిలకే కాదు సినిమా హీరోయిన్ లకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కెరీర్ తరవాత హ్యాపీగా విదేశాల్లో సెటిల్ అవ్వాలని కొందరు..విదేశీ యువకుల ప్రేమలో పడి మరి కొందరు ఇలా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ టాలీవుడ్ భామలు విదేశాలకు చెందిన వారిని పెళ్లాడి సెటిల్ అయ్యారు. అలా పెళ్లాడిన వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం…
Also Read: సినిమాల్లోకి వచ్చాక పేరుమార్చుకున్న హీరోయిన్లు అసలు పేర్లు ఏంటంటే..?
Advertisement
టాలీవుడ్ లో సీనియర్ హీరోగా రంభ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయ్యేవారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగలో స్పెషల్ సాంగ్ చేసిన రంభ తన అందంతో అవాక్కయ్యేలా చేసింది. ఇక రంభ విజయవాడలోనే జన్మించారు. సినిమాల్లో హీరోయిన్ గా రానించిన రంభ కెనడాకు చెందిన ఇంద్రన్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నారు.
కెరళ బ్యూటీ మీరాజాస్మీన్ తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పక్కింటి అమ్మాయిలా కనిపించే మీరా జాస్మిన్ అందం అభినయంతో ఆకట్టుకుంది. భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో మీరాజాస్మిన్ కు ఎంతో పాపులారిటీ వచ్చింది. ఇక ముంబైలో అనిల్ జాన్ అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహం చేసుకున్న మీరా ఆ తరవాత న్యూజెర్సీలో సెటిల్ అయ్యింది. కానీ వీదిద్దరూ కొంతకాలానికి విడిపోయారు.
Advertisement
రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ స్విట్ మెమరీస్ హీరోయిన్ గోపిక మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తనవైపు తిపుప్పుకుంది. ఆ తరవాత పలు చిత్రాలలో నటిచిన ఈ హీరోయిన్ అజిలేష్ చాకో అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.
ప్రీతిజింటా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుతో పాటూ బాలీవుడ్ ఎన్నోచిత్రాలలో నటించిన హీరోయిన్. టాలీవుడ్ లో ప్రేమంటే ఇదేరా సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం జీని గుడ్ ఇనఫ్ అనే వీదేశీయుడిని పెళ్లాడి సెటిల్ అయ్యింది. అంతే కాకుండా ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ ను నడిపిస్తోంది.
రాధికా అప్టే కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు భాగా సుపరిచితమే. రక్త చరిత్ర సినిమాలో పరిటాల సునిత పాత్రలో నటించడంతో పాటూ లెజెండ్ సినిమాలో బాలయ్యకు జోడీగా నటించింది. ఈ హాట్ బ్యూటీ ఆ తరవాత లండన్ కు చెందిన బెనడిక్ట్ టేలర్ ను పెళ్లాడింది.
Read More: ఒకే తరగతిలో..ఓకే క్లాసులో చదువుకున్న సెలబ్రిటీలు వీరే..!