సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా మంది హీరోయిన్ల పేరు మారిపోతుంటుంది. అప్పటి వరకూ ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాకుండా మరో పేరు పెట్టుకుంటారు. అయితే కొంతమంది హీరోయిన్ లు న్యూమరాలజీ ప్రకారంగా అదృష్టం కోసం పేరు మార్చుకుంటే మరికొందరు హీరోయిన్ లపేర్లను దర్శకులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియన్ హరోయిన్లు చాలా మందే పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరుమార్చుకున్న ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం….
Advertisement
Jayasudha
సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జయసుధ అసలు పేరు సుజాత. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత దర్శకుడు దాసరినారాయణ రావు ఆమె పేరును జయసుధగా మర్చారు.
Jayapradha
అంతే కాకుండా టాప్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ జయప్రద..అయితే జయప్రద అసలు పేరు లలితా రాణి కానీ సినిమాలలోకి వచ్చాకే పేరు మార్చుకున్నారు.
Soundarya
అందాల తార సౌందర్య పేరు కూడా సౌందర్య కాదట. ఆమె అసలు పేరు సౌమ్య కాగా స్వరాష్ట్రం కర్నాటక కానీ ఆమె తెలుగువారికే ఎంతో దగ్గరయ్యారు.
Advertisement
Also Read: శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ది బెస్ట్ సాంగ్స్ ఇవే..!
Roja
ఇక సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపుతెచ్చుకున్న రోజా అసలు పేరు కూడా రోజా కాదు. ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి కాగా సినిమాల్లోకి వచ్చాక పేరు అంత క్యాచీగా లేదని సీనియర్ నటుడు మరియు రాజకీయ నాయకుడు శివప్రసాద్ రోజా మార్చారట.
Rambha
ఇక హీరోయిన్ రంభ అసలు పేరు విజయలక్ష్మి కాగా రంభ గా మార్చుకుంది.
Anushka Shetty
అంతే కాకుండా టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి పేరు కూడా అనుష్క కాదట. ఆమె నిక్ నేమ్ తో పాటూ అసలు పేరు కూడా స్వీటీ శెట్టినే కాగా ఇండస్ట్రీలోకి వచ్చాక సూపర్ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున అనుష్క అని పేరు పెట్టారట.
Advertisement
Also Read: ఒకే తరగతిలో..ఓకే క్లాసులో చదువుకున్న సెలబ్రిటీలు వీరే..!