Home » టాలీవుడ్ హీరోయిన్ తో కోలీవుడ్ విలన్ ప్రేమాయణం..?

టాలీవుడ్ హీరోయిన్ తో కోలీవుడ్ విలన్ ప్రేమాయణం..?

by Anji
Ad

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, గాయం 2, ఎవరైనా ఎప్పుడైనా వంటి కొన్ని తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించిన నటి విమలారామన్. ఈమె కోలీవుడ్ నటుడు వినయ్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల విమలారామన్  తన 42వ పుట్టిన రోజును ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని తన తల్లిదండ్రులతో కలిసి జరుపుకుంటుంది. పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Advertisement

విమలారామన్ కి ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకమైంది. ఇంట్లో నా కుటుంబంతో గడపడం చాలా ఆనందంగా ఉందంటూ.. నటి తన ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చింది. విమలారామన్ బర్త్ డే వేడుకల్లో నటుడు వినయ్ రాయ్ ఉండడం వల్ల పలు సందేహాలకు తావు ఇస్తోంది. దీనికి తోడు కొద్ది నెలల కిందట వినయ్, విమల డేటింగ్ లో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించకపోవడం విశేషం.  

Advertisement

Also Read :  mangli:మంగ్లీ రేంజ్ మామూలుగా పెరగలేదు..ఒక్క పాటకు ఇన్ని లక్షలు తీసుకుంటోందా..?

 

డ్యామ్ 999 సెట్స్ లో మొదటిసారిగా కలుసుకొన్న ఈ జంట అప్పటి నుంచి ప్రేమలో ఉన్నట్టు ఈసారి నటి బర్త్ డే వేడుకలలో వినయ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. కుటుంబం అని సంబోధించడం ద్వారా తమ బంధాన్ని దృవీకరించిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమాల విషయానికొస్తే.. తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో హీరోగా నటించిన వినయ్ ప్రస్తుతం విలన్ పాత్రల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం డీజిల్ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ లెజెండరీ డైరెక్టర్ కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందించిన పోయ్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

Also Read :  “గజిని” హీరోయిన్ అసిన్ గుర్తుందా..ఇప్పుడేలాఉందంటే..?

Visitors Are Also Reading