Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » “గజిని” హీరోయిన్ అసిన్ గుర్తుందా..ఇప్పుడేలాఉందంటే..?

“గజిని” హీరోయిన్ అసిన్ గుర్తుందా..ఇప్పుడేలాఉందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ఇండస్ట్రీలలో కొంతమంది హీరో, హీరోయిన్లు, నటీనటులు ఓవర్ నైట్ లోనే స్టార్డం తెచ్చుకుంటారు. అలా కొన్ని సినిమాలు చేశాక ఇండస్ట్రీ నుంచి కనబడకుండా పోతారు. ఎంతో టాలెంట్ ఉన్న ఆఫర్లు రాక ఇబ్బందులు ఎదుర్కొని మళ్లీ ఇండస్ట్రీలో అసలు కనిపించకుండా పోయిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కోవకే చెందింది ఆసిన్. అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా మారిన ఆసిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Ad

రవితేజ హీరోగా వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కొట్టడంతో ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. సూర్య హీరోగా గజిని, నాగార్జున హీరోగా శివమణి, ప్రభాస్ హీరోగా చక్రం, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అన్నవరం లాంటి సినిమాల్లో కూడా నటించింది అసిన్. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఏదిగింది. ఆ తర్వాత రాహుల్ శర్మ అనే వ్యక్తితో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది.

Advertisement

ఇక వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు మైక్రోమ్యాక్స్ అధినేత. వీరి వివాహం 2016 న్యూఢిల్లీలోని ఓ చర్చిలో గ్రాండ్ గా జరిగింది.. అసిన్ కు ఒక పాప కూడా ఉంది. సినిమాలకు గుడ్ బాయ్ చెప్పినప్పటికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది.. అలాంటి అసీన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే మీరు కూడా షాకవుతారు..

also read:

Visitors Are Also Reading