Home » నార్త్ లో భారీ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరంటే..? ప్రభాస్, బన్నీ కాదు..!

నార్త్ లో భారీ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరంటే..? ప్రభాస్, బన్నీ కాదు..!

by Sravya
Ad

ఈరోజుల్లో టాప్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు మీద ఫోకస్ చేశారు. పాన్ ఇండియా మూవీ తో సక్సెస్ కొట్టాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ అల్లు అర్జున్ వంటి వాళ్ళు పాన్ ఇండియా మూవీస్ తో ఇప్పటికే హిట్ కొట్టారు ప్రభాస్ బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా మారారు.

prbahs

Advertisement

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి ని ఎంతో అద్భుతంగా తెరమీదకి తీసుకొచ్చారు అత్యధిక వసూళ్లను రాబట్టింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పుష్ప సినిమా హిందీ వెర్షన్ లో 100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది.

పుష్ప విడుదల తర్వాత అల్లు అర్జున్ కి నార్త్ లో విపరీతమైన ఫేమ్ వచ్చింది పుష్ప టు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ విషయానికి వస్తే వీళ్లిద్దరూ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద హిట్ అయింది. దాదాపు 1100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్ దేవరా, గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి.

Advertisement

Also read:

ram pothineni

అయితే అల్లు అర్జున్ ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా హీరోలు ఉన్నారు కానీ ఒక హీరో వీళ్ళకి మించి క్రేజ్ ని అనుభవిస్తున్నారు. ఆ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని. రామ్ నటించిన సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. యూట్యూబ్ లో విడుదల చేశారు. ఆ సినిమాలని హిందీ ఆడియన్స్ విపరీతంగా చూశారు. గూగుల్లో నార్త్ ఆడియన్స్ రామ్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రభాస్ మాత్రమే కాకుండా నార్త్ లో భారీ క్రేజ్ ని రామ్ తెచ్చుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి

Visitors Are Also Reading