Home » ప్రేమ పెళ్లి చేసుకోవడం వలన కలిగే లాభాలు ! ఇన్ని ఉన్నాయా ? అమ్మో

ప్రేమ పెళ్లి చేసుకోవడం వలన కలిగే లాభాలు ! ఇన్ని ఉన్నాయా ? అమ్మో

by Sravya
Ad

చాలామంది ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోవడం వలన ఏమైనా లాభం ఉందా..? పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా ప్రేమ పెళ్లి చేసుకోవడం వలన ఎటువంటి లాభాలు ఉంటాయి..? ఎటువంటి నష్టాలు ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకోవాలి. ప్రేమ వివాహం తో వైవాహిక బంధం లోకి కొంతమంది అడుగుపెడితే, పెద్దలు చెప్పిన వారితో కొంతమంది బంధాన్ని మొదలు పెడుతున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పట్టొచ్చు.

Advertisement

 

ప్రేమ మొదలవ్వడానికి సమయం పడుతుంది. అదే ప్రేమ వివాహంలో అలా కాదు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత బంధం మొదలవుతుంది. ప్రేమ పుట్టిన తర్వాత అది పెళ్లి వరకు వెళుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యం. అరెంజ్డ్ మ్యారేజ్ లో జీవిత భాగస్వామి మీకు తెలియదు కనుక మీ భాగస్వామితో ప్రారంభ రోజుల్లో ప్రేమలో మీరు పడరు. కానీ ప్రేమ వివాహం అన్నది జంట మధ్య ప్రేమ ద్వారా వస్తుంది.

Also read:

Advertisement

పెళ్లికి ముందు తర్వాత కూడా ప్రేమ అలానే ఉంటుంది. అరెంజ్డ్ మ్యారేజ్ లో ప్రేమ నిదానంగా సాగుతుంది. ప్రేమ వివాహంలో ప్రేమ రోజు రోజుకి మరింత బలపడుతుంది. ఒకరినొకరు ఇదివరకే అర్థం చేసుకుంటూ ఉంటారు కాబట్టి గొడవలు వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. అదే అరేంజ్డ్ మ్యారేజ్ లో మీ జీవిత భాగస్వామి మీకు ముందు నుండి తెలియదు కాబట్టి వాళ్ళు చేసే పనులు కొన్ని మీకు నచ్చకపోవచ్చు దాని వలన గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్ లో ప్రేమ క్రమంగా పెరుగుతూ ఉంటుంది ప్రేమ వివాహంలో జంట ఆకర్షణ ప్రేమ కాలక్రమమైన తగ్గుతూ ఉంటుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading