Home » తెలుగులో వచ్చిన మొదటి ఫ్యాక్షన్ సినిమా ఏదో తెలుసా…? ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే…?

తెలుగులో వచ్చిన మొదటి ఫ్యాక్షన్ సినిమా ఏదో తెలుసా…? ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే…?

by AJAY
Ad

ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్. తెలుగు లోనే ఎక్కువగా ఫ్యాక్షన్ సినిమాలు వస్తుంటాయి. అంతేకాకుండా బాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులు సైతం తెలుగు ఫ్యాక్షన్ సినిమాలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చూసి విసిగిపోయిన టాలీవుడ్ ప్రేక్షకులు డిఫరెంట్ గా వచ్చిన ఏ సినిమాను అయినా ఆదరిస్తారు. ఈ క్రమంలోనే ఫ్యాక్షన్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Advertisement

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సుమోలు ఎగరడాలు.. బాంబులు పేలడాలు, తొడ కొడుతూ డైలాగులు చెప్పడాలను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. టాలీవుడ్ లో వచ్చిన సమరసింహారెడ్డి, ప్రేమించుకుందాం రా, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, ఇంద్ర, ఆది, నరసింహనాయుడు లాంటి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.

Advertisement

అప్పట్లో హీరోలు దర్శకుల వెంటపడి మరీ ఫ్యాక్షన్ కథలతో రావాలని చెప్పేవారు. టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు అంతటి క్రేజ్ ఏర్పడింది. అయితే 1990 కాలంలోనే తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలు మొదలయ్యాయి. మొట్టమొదటగా తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో రాధాకృష్ణ, చలపతిరావు “కడప రెడ్డమ్మ” అనే సినిమాను నిర్మించారు.

ఈ సినిమాలో రాయలసీమ జీవన స్థితిగతులను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, శారద, గిరిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. అంతేకాకుండా కడప రెడ్డమ్మ సినిమా కథను పరుచూరి బ్రదర్స్ రాశారు. టాలీవుడ్ లో వచ్చిన ఈ మొదటి ఫ్యాక్షన్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

Visitors Are Also Reading