Home » టాలీవుడ్ లో బ్రేక్ అప్ అయిన పెళ్లిళ్లు!

టాలీవుడ్ లో బ్రేక్ అప్ అయిన పెళ్లిళ్లు!

by Azhar
Ad

టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు పెళ్ళి వార్త‌లు విన్న‌ప్పుడు వారి అభిమానులు ఎంత‌గా ఆనంద‌ప‌డ‌తారో..వారు విడిపోయిన‌ప్పుడు అంత‌గానే బాధ‌ప‌డ‌తారు. అయ్యే నా ఫేవ‌రెట్ స్టార్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ఇలా జ‌రిగిందేంటి అని విచారిస్తూ ఉంటారు. అయితే సినీ తార‌ల‌యినా… ఎంత పెద్ద సెల‌బ్రెటీలైనా ఎవ‌రి స‌మ‌స్య‌లు వారికి ఉంటాయి. అలా వివిధ ర‌కాల కార‌ణాల‌తో విడిపోయిన టాలీవుడ్ జంట‌లు మ‌ళ్ళీక‌లిస్తే బావుండు అనుకున్న వాళ్ళ‌లో అస‌లు విడిపోకుండా ఉంటే ఇంకా బావుండు అనుకునేవాళ్ళ జంట‌లు ఏవో ఓ లుక్కేద్దాం…

ఝాన్సీ, జోగినాయుడు దాదాపు 25ఏళ్ళకు పైగా యాంక‌ర్‌గా, సినీ న‌టిగా ఇండ‌స్ట్రీలో చ‌లామ‌ణి అవుతున్న ఝాన్సీ త‌న తోటి న‌టుడు జోగినాయుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ధ‌న్య అనే పాప‌కు జ‌న్మ‌నిచ్చారు. తొమ్మిదేళ్ళ వీరి కాపురం స‌జావుగా సాగింది. త‌ర్వాత వీరి కాపురంలో నిధానంగా గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌ధానంగా ఆర్ధిక ఇబ్బందులు, హై ప్రొఫైల్‌, ఆస్తిపాస్తులు దీంతో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. డ‌బ్బు, విలాసాల గురించి ఆలోచించ‌డం వ‌ల్లే వారికి వైవాహిక జీవితంలో క‌ల‌హాలు ఆరంభ‌మ‌య్యాయ‌ని జోగినాయుడు చాలా ఇంట‌ర్వ్యూల్లో స్వయంగా తెలిపారు. తాను ఝాన్సీ కోసం ఎనిమిదేళ్ళు తిరిగి చూశాను. కానీ ఆమె తిరిగి రాలేద‌ని కూడా తెలిపారు. త‌ర్వాత జోగినాయుడు సౌజ‌న్య అనే ఆవిడ‌ని రెండో వివాహం చేసుకున్నారు. ఝాన్సీ మాత్రం పాప‌, త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటుంది.

Advertisement

Also Read: గోత్రనామాలు అంటే ఏమిటి..? అవి ఎలా వచ్చాయి..?

సోనియా అగ‌ర్వాల్‌, డైరెక్ట‌ర్ సెల్వారాఘ‌వ‌న్ వీరిద్ద‌రు ప్రేమించి వివాహ‌మాడారు. సోనియా 7జి బృందావ‌న్ కాల‌నీ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత త‌మిళ‌, మ‌ల‌యాళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. త‌మిళ హీరో ధ‌నుష్ సెల్వ‌రాఘ‌వ‌న్ త‌మ్ముడు. 2006లో వీరిద్ద‌రూ వివాహం చేసుకున్నారు. వివాహం త‌రువాత ఆమె సినిమాల్లో న‌టించ‌డం మానేశారు. ఆ త‌రువాత వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు మొద‌ల‌య్యాయి. 2010లో ఈ జంట విడిపోయింది. ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సెన్నింగ్స్ మొద‌లుపెట్టింది. శ్రీరాఘ‌వ 2011లో గీతాంజ‌లి అనే ఆమెను వివాహం చేసుకున్నారు.

Advertisement

అమ‌లాపాల్ డైరెక్ట‌ర్ విజ‌య్ ఇద్ద‌రూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2014 జూన్‌లో వీరి వివాహం జ‌రిగింది. అయితే వివాహం త‌రువాత సినిమాల్లో న‌టించడానికి వీల్లేద‌ని విజ‌య్ వారి కుటుంబ స‌భ్యులు ష‌ర‌తులు పెట్టారు. కానీ అమ‌లీపాల్ పెళ్ళైన త‌రువాత కూడా మ‌రింత హాట్ హాట్‌గా న‌టించ‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయి. దాంతో పెద్ద గొడ‌వ‌లు జ‌రిగాయి 2017లో వీరిద్ద‌రూ విడిపోయారు. ఆ త‌రువాత విజ‌య్ ఐశ్వ‌ర్య‌ను వివాహం చేసుకున్నారు. ఆ త‌రువాత మ్యూజీషియ‌న్‌ని అమ‌లాపాల్ వివాహం చేసుకున్నారు.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రేణుదేశాయి ప్రేమించి కొంత కాలం స‌హ‌జీవ‌నం చేసి ఆ త‌రువాత వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఒక పాప‌, బాబు కొంత కాలం పాటు వీరి జీవితం కూడా సాఫీగానే సాగింది. ఆ త‌రువాత చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల్ల వీరిద్ద‌రూ కూడా విడిపోయారు.

టాలీవుడ్ మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత వీరిద్ద‌రు ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. వీరిద్ద‌రి సంప్ర‌దాయాలు అన్నీ వేర‌యిన‌ప్ప‌టికీ ఇరువురి కుటుంబ స‌భ్యులు ఒప్పుకుని రెండు ప‌ద్ధ‌తుల్లోనూ వీరి వివాహ శుభ‌కార్యాన్ని అంగ‌రంగ వైభ‌వంగా చేశారు. నాలుగేళ్లు బాగానే ఉన్నారు. ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా వీరిద్ద‌రూ ఓ రోజు త‌మ సోష‌ల్ మీడియా ట్విట‌ర్ ఖాతా ద్వారా వీరిద్ద‌రూ బ్రేక‌ప్ తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. దాంతో ఒక్క‌సారిగా అభిమానులు చాలా బాద‌ప‌డ్డ‌రు.

ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా వీరిద్ద‌రూ ఓ రోజు త‌మ సోష‌ల్ మీడియా ట్విట‌ర్ ఖాతా ద్వారా వీరిద్ద‌రూ బ్రేక‌ప్ తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. దాంతో ఒక్క‌సారిగా అభిమానులు చాలా బాద‌ప‌డ్డ‌రు.

Also Read: పెళ్లికి సై..కానీ పిల్లలకు నై…సర్వేలో యువత షాకింగ్ సమాధానాలు…!

Visitors Are Also Reading