హిందువుల్లో ప్రతి కులం లోనూ ఇంటి పేరుతో పాటు గోత్రనామాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా గుడికి వెళ్ళినప్పుడు లేదంటే పెళ్లిచూపుల సందర్భంగా మీ గోత్రనామాలు ఏంటి అని ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది యువతకు అసలు గోత్రనామాలు ఉంటాయని తెలియదు. అంతేకాకుండా తమ గోత్రం ఏంటో కూడా ప్రస్తుత యువతకు చాలామందికి తెలియదు. కానీ గోత్రనామాలు తెలుసుకోవడం ఎంతో అవసరం… అంతేకాకుండా అసలు గోత్ర నామాలు ఎందుకు వచ్చాయి… ఎలా వచ్చాయి..? అనేది కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం….
Advertisement
మన పూర్వీకులకు విద్య నేర్పించే గురువులు ఉండేవారు. అయితే ఎలా విద్య నేర్పిన అందుకు గాను ఆ కుటుంబాలు గురువుల పేరును గోత్రనామం గా పెట్టుకునేవి. అలా ప్రతి కుటుంబానికి ఒక్కో గోత్రనామం వచ్చింది. అయితే అప్పట్లో చదువు నేర్చుకోని అసలు గురువుల వద్దకు వెళ్లని వాళ్లు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి గోత్రనామాలు ఎలా వచ్చాయి అనే డౌట్ రావచ్చు. అయితే గురువు దగ్గర విద్యను అభ్యసించని వారు తమ పూర్వీకులలో మొదటి వ్యక్తి పేరును గోత్రనామంగా పెట్టుకునే వారు. ఇక ఆ కుటుంబం మొత్తం అదే గోత్రనామం ను పాటిస్తూ వస్తోంది. అలా తరాలు మారినా ఓకే గోత్రనామం అనాదిగా వస్తోంది. ఇక అన్ని కులాల్లో కొన్ని కుటుంబాల ఇంటి పేర్లు వేరైనా గోత్రాలు మాత్రం ఒక్కటే ఉంటాయి. అంతే వారి పూర్వీకులు ఓకే కుటుంబానికి చెందిన వారు అని అర్థం. అంతే కాకుండా ఓకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అన్నా చెల్లెళ్ల వరుస వస్తుంది. కాబట్టి అలా ఓకే గోత్రం ఉన్నవాళ్లు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అందువల్లే పెళ్లి చూపులకి వెళ్లే ముందే మీ ఇంటి పేరు ఏంటి అనే ప్రశ్న వేస్తారు. ఆ తరవాత గోత్రాలు తెలుసుకుంటారు. వేరు వేరు గోత్రాలు ఉంటేనే సంబంధం కుదుర్చుకుంటారు.
Advertisement