Home » పెళ్లికి సై..కానీ పిల్లలకు నై…సర్వేలో యువత షాకింగ్ సమాధానాలు…!

పెళ్లికి సై..కానీ పిల్లలకు నై…సర్వేలో యువత షాకింగ్ సమాధానాలు…!

by AJAY
Ad

ఒకప్పుడు పెళ్లి చేసుకుని ఏడాది తిరగకుండానే పిల్లలను కనాలి…లేదంటే ఎంతో ఆందోళన చేసేవాళ్ళు. ఇక కాస్త లేట్ అయ్యిందంటే ఇరుగుపొరుగు వాళ్ళు కూడా ఇంకా పిల్లలు లేరా అంటూ అనుమానంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ మారినట్టే పిల్లలను కానే విషయంలోనూ ట్రెండ్ మారిపోయింది. పెళ్లి వైవాహిక జీవితం…పిల్లల గురించి ఓ సర్వే నిర్వహించగా అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

సర్వేలో కొంతమంది పెళ్లి కావాలి కానీ అప్పుడే పిల్లలు వద్దు అని చెప్పగా మరికొంతమంది….అసలు పిల్లలే వద్దు అని చెప్పడం అవ్వాల్సిన విషయమే. పెళ్లి అనేది ఎవరైనా చేసుకోవాల్సిందే..అది జీవితంలో ముఖ్యమైన ఘట్టం అని 52శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక మరో 25శాతం మంది పెళ్లిని లైట్ తీసుకున్నారు…అంటే పెళ్లి తమకు అవసరం లేదని చెప్పేశారు. అంతే కాకుండా అసలు పెళ్లే వద్దు మాకు కానీ డేటింగ్ చేస్తాం అని మరో 25 మంది చెప్పడం విశేషం. పెళ్లి తరవాత పిల్లల మ్యాటర్ కు వస్తె ఇందులో 54 శాతం మంది పిల్లలు కావాలని చెప్పగా….18 శాతం మంది ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారు. కానీ 14శాతం మంది పెళ్లి కావాలి కానీ పిల్లలు వద్దు అని చెప్పారు.

Advertisement

Advertisement

Marriage

Marriage

పెళ్లి కావాలి పిల్లలు కావాలి అని 38 శాతం మంది మాత్రమే చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 63 శాతం మంది పెళ్లి విషయం లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. అయితే పిల్లలు ఎందుకు వద్దని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించగా …..కొంతమంది పిల్లను భారంగా భావిస్తున్నారు.

ఇక మరికొంతమంది ప్రస్తుతం ఉన్న ఖర్చులు టెన్షన్ ల మధ్య పిల్లలు అవసరమా..అనుకుంటున్నారు. నిజానికి సోలో లైఫ్ సో బెటర్ అనుకున్నా…పెళ్లి పిల్లలు లేకపోతే చివరికి బాధ పడాల్సిందేనని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Visitors Are Also Reading