Home » లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్ లు….నరేష్ అన్ని కోట్లకు అధిపతా…!

లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్ లు….నరేష్ అన్ని కోట్లకు అధిపతా…!

by AJAY
Ad

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ నటుడు వీకే నరేష్ పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నరేష్ నటి పవిత్ర లోకేష్ లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో నరేష్ ఒకసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఇక అప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇవ్వగా… ఇప్పుడు నాలుగో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి. దానికి తోడు వీరిద్దరూ మహాబలేశ్వరంలోని ఆలయంలో పూజలు చేశారు.

 

Advertisement

అంతేకాకుండా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని మైసూర్ లోని ఓ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇలా వార్తల్లో నిలిచిన నరేష్ కు అసలు మూడు పెళ్లిళ్లు ఎలా అయ్యాయి…? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్ ఆస్తుల చిట్టా అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఆరు పదుల వయసున్న నరేష్ లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. నరేష్ వద్ద 4, 5 లగ్జరీ కార్లు ఉన్నాయి.

naresh new car

Advertisement

అంతేకాకుండా తనకు రేసింగ్ అంటే ఇష్టమని నరేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నరేష్ విజయనిర్మల కుమారుడు అన్న సంగతి తెలిసిందే. దాంతో వారసత్వంగా నరేష్ కు 300 కోట్ల వరకు ఆస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. విజయనిర్మల చెన్నై మరియు హైదరాబాద్ లలో భారీగా ఆస్తులను సంపాదించినట్లు కూడా తెలుస్తోంది. నరేష్ కు హైదరాబాద్ చుట్టుపక్కల ఏకంగా నాలుగైదు ఫామ్ హౌస్ లు ఉన్నాయని సమాచారం. అంతే కాకుండా గచ్చిబౌలిలో ఐదెకరాల్లో భారీ ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నట్టు తెలుస్తోంది.

naresh caravan

వీటితో పాటు మొయినాబాద్, శంకర్ పల్లి లో కూడా నరేష్ కు ఫామ్ హౌస్ లు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు చెన్నైలో కూడా నరేష్ సొంత ఇంటిని నిర్మించుకున్నట్టు సమాచారం. ఇక నరేష్ కూడా నటుడిగా చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోగాను నరేష్ చేతినిండా సంపాదించాడు. అంతేకాకుండా ఇప్పుడు నటుడిగా కూడా ఫుల్ బిజీగా ఉండడంతో ఒక్కో సినిమాకు 20 లక్షల పైనే రెమ్యునరేషన్ పుచ్చుకుంటాడని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లోనే సొంత కారెవ్యాన్ కలిగిన నటుడు కూడా నరేష్ ఒక్కడే అంటే ఎంత రిచ్ పార్టీనో అర్థం చేసుకోవచ్చు.

Visitors Are Also Reading