Home » ఫిలింఫేర్ అవార్డ్స్: ప్రభాస్ లాస్ట్..ఫస్ట్ స్థానంలో ఉన్నది ఎవరంటే..?

ఫిలింఫేర్ అవార్డ్స్: ప్రభాస్ లాస్ట్..ఫస్ట్ స్థానంలో ఉన్నది ఎవరంటే..?

by Sravanthi
Ad

సినీ ఇండస్ట్రీ లో వచ్చే కొన్ని అవార్డ్స్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది ఫిలింఫేర్ అవార్డ్. ఈ అవార్డు కావాలని చాలా మంది హీరోలు వెయిట్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లోని ఫస్ట్ జనరేషన్ హీరోల నుంచి ఈ అవార్డును ఎంతో మంది గెలుచుకున్నారు. రీసెంట్ గా 67వ ఫిలింఫేర్ అవార్డును కూడా అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి అవార్డు దక్కింది.
#1. పవన్ కళ్యాణ్ :

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 1 ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. గబ్బర్ సింగ్ మూవీ లో వేసిన గబ్బర్ సింగ్ పాత్రకు గాను పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్టర్ కు అవార్డు వచ్చింది.
#2. జూనియర్ ఎన్టీఆర్

ఈయనకు రెండు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. 2008లో తొలిసారి యమదొంగ మూవీలో పాత్రకు, రెండవసారి 2016లో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో మూవీకీ గాను అభిరామ్ గా తను చేసిన రోల్ కు రెండవ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.

also read:చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌లిస్తే అధికారం కాదు అంద‌కార‌మే…! వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

#3. రామ్ చరణ్ :

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడు అవార్డులతో రికార్డ్ క్రియేట్ చేశాడు. చరణ్ మొదటి చిత్రమైన చిరుత మూవీ కి గాను ఈ అవార్డు రాగా, రెండవ మూవీ అయిన మగధీర సినిమా కు ఆయన నటన గాను రెండవ అవార్డు వరించింది. 2018 లో రిలీజైన రంగస్థలం మూవీ కి గాను చిట్టిబాబు గా అందరినీ ఆకట్టుకొని మూడో సారి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
#4. అల్లు అర్జున్ :

Advertisement

అల్లు అర్జున్ మొదటి సారి 2009లో పరుగు సినిమా కి వచ్చింది. ఇక 2011లో రెండవ ఫిల్మ్ ఫేర్ వేదం మూవీ లో కేబుల్ రాజుగా అందరినీ మెప్పించి మరోసారి అవార్డును సొంతం చేసుకున్నారు. ఆతర్వాత 2014లో రిలీజ్ అయిన రేసుగుర్రం మూవీ కి గాను మూడోసారి ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రుద్రమదేవి మూవీ లో చేసిన గోనగన్నారెడ్డి పాత్రకు గాను బెస్ట్ యాక్టర్ అండ్ సపోర్ట్ రోల్ లో అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాకుండా పుష్ప సినిమా లో పుష్ప రోల్ కు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు.
#5.మహేష్ బాబు :

మహేష్ బాబు 2003 లో రిలీజ్ అయిన ఒక్కడు మూవీ కి ఫస్ట్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత పోకిరి సినిమా గాను మరో అవార్డు, 2011లో దూకుడు మూవీ కి గాను మూడో అవార్డు, 2013లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పాత్రకి నాలుగో అవార్డు, శ్రీమంతుడు మూవీ గాను ఐదవ సారి బెస్ట్ డాక్టర్ గా అవార్డు గెలుచుకున్నాడు. ఈ విధంగా టాప్ ప్లేస్ లో మహేష్ బాబు నిలిచాడు. ఇప్పటి వరకు ప్రభాస్ కు ఒక్క ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.

also read:

Visitors Are Also Reading