Home » తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లో నటించిన సినిమాల‌లో తొలిప్రేమ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా మంచివిజ‌యం సాధించింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో అందం అభిన‌యంతో మెప్పించ‌డంతో కీర్తిరెడ్డి వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. తెలుగులో కీర్తి రెడ్డి ఆలీ హీరోగా నటించిన గ‌న్ షాట్ సినిమాలో హీరోయిన్ గా న‌టించి తెలుగుతెర‌కు ప‌రిచ‌యం అయ్యింది.

Advertisement

ఈ సినిమా కంటే ముందు కీర్తిరెడ్డి త‌మిళంలో మూడు సినిమాల వర‌కూ న‌టించింది. అయితే తొలిప్రేమ సినిమాతోనే ఈ అమ్మ‌డికి బ్రేక్ వ‌చ్చింది. తొలిప్రేమ త‌ర‌వాత వెంట‌నే నాగార్జున హీరోగా న‌టించిన రావోయిచంద‌మామ సినిమాలో పిలిచి అవ‌కాశం ఇచ్చారు. ఆ త‌ర‌వాత వ‌డ్డేన‌వీన్ ప‌క్క‌న ఓ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన‌మేర విజ‌యం సాధించ‌లేదు.

Advertisement

ఇక 2002 త‌ర‌వాత బ్యూటీకి ఆఫ‌ర్ లు త‌గ్గిపోయాయి. దాంతో మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన అర్జున్ సినిమాలో మ‌హేశ్ బాబుకు అక్క పాత్ర‌లో న‌టించింది. ఆ త‌ర‌వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పింది. అంతే కాకుండా టాలీవుడ్ హీరో సుమంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే కొన్నేళ్ల‌కే వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర‌వాత అమెరికాకు చెందిన వ్య‌క్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గా కీర్తిరెడ్డి ఓ ఫంక్ష‌న్ లో మెరిసింది. అయితే గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. దాంతో ప్ర‌స్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

also read : “శాకుంతలం” సినిమాలో సమంత పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్!

Visitors Are Also Reading