సాధారణంగా ఇంట్లో ఏం ఉన్నా లేకపోయినా కానీ వెల్లుల్లి మాత్రం తప్పకుండా ఉంచుకోండి. ఎందుకంటే వాటితో చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా మనం ఉంటున్న ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనకు నచ్చుతుంది. పిల్లలు ఉన్న ఇంట్లో వస్తువులు త్వరగా పాడవుతుంటాయి. మాటిమాటికి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతిసారి కెమికల్ క్లీనర్స్ వాడడం అంత మంచిది కాదు. ఇంట్లో అన్ని గదుల కంటే డర్టీగా ఉండేది బాత్‌రూమ్. మిగతా గదులను ఏదో ఒక సందర్భంలో రోజు శుభ్రం చేస్తుంటాం. కానీ బాత్‌రూంను ప్రతిరోజు ఎవ్వరు క్లీన్ చేయరు. దీనిని శుభ్రం చేయడానికి వెల్లుల్లి ఉంటే చాలు. బాత్‌రూమ్ రాత్రికి క్లీన్ అయిపోయి తెల్లారే సరికి తళతళ మెరిసిపోతుంటుంది.
ఇది కూడా చదవండి : ఈ ఫోటోలోని అమ్మాయి ఒకప్పుడు స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ అని మీకు తెలుసా..?
Advertisement
ఇది వాస్తవం వెల్లుల్లికి అంత శక్తి ఉంటుంది. వెల్లుల్లిలోని ఒక రెబ్బ చాలు. టాయిలెట్‌ని క్లీన్ చేయడానికి. వెల్లుల్లి మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు.. మన పరిసరాలను కూడా శుభ్రం చేస్తుంది. వెల్లుల్లిలో ఎల్లిసిన్ ఎల్లిసిన్ అనేది ఉంటుంది. ఇది ప్రత్యేక వాసన కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా అంతు చూస్తుంది. బాత్‌రూమ్‌లో ఉండే బ్యాక్టీరియా , ఫంగస్ వంటి వాటిని ఇది చంపేస్తుంది. అందుకే ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలతో బాత్రూం ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇది కూడా చదవండి : సీక్రెట్ గా పెళ్లి చేసుకుని హాట్ టాపిక్ గా మారిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే..!
తొలుత రాత్రి కాగానే బాత్‌రూంలో ఒక వెల్లుల్లి రెబ్బ ఉంచండి. అక్కడి తడి వాతావరణంలో అది రాత్రంతా ఉండాలి. తెల్లారే ఆ వెల్లుల్లి బాత్‌రూంలో రుద్దేయండి. అప్పటికే అక్కడి చెడు వాసన పోవడమే కాదు.. బ్యాక్టీరియా కూడా తట్ట బుట్ట సర్దుకొని వెళ్తుంది.
ఇక మరో పద్దతిలో కూడా చేయవచ్చు. ఒక గిన్నెలో నీరు పోసి బుడగలు వచ్చేంత వరకు ఉడకనివ్వండి. అందులో 3 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టి వెయండి. ఒక నిమిషం తరువాత స్టవ్ ఆపేయండి. నీరు చల్లారిన తరువాత అనగా పావుగంట తరువాత ఆ నీటిని బాత్‌రూమ్‌లో చల్లండి. రాత్రి అంతా అలా వదిలి వేయండి. తెల్లారిన తరువాత బ్రష్‌తో తుడిచేయండి. అంతా క్లీన్ అయిపోతుంది. వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్ బాత్‌రూమ్‌లో ఉండే దుర్వానను పోగొట్టడంతో పాటు బ్యాక్టీరియాను చంపేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి.
ఇవి కూడా చదవండి : ప్రతి రోజూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?